Financial Committees in AP Assembly: ఏపీ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, అంచనాల కమిటీల ఛైర్మన్లను అధికారికంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రజాపద్దుల సంఘం (PAC) ఛైర్మన్‌గా పులవర్తి రామాంజనేయులు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కమిటీ (PUC) ఛైర్మన్‌గా కూన రవికుమార్, అంచనాల కమిటీ ( Estimates Committee) ఛైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరావు నియామకాన్ని ఆమోదిస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
పీఏసీ ఛైర్మన్‌గా పులవర్తి రామాంజనేయులు - ఫైనాన్షియల్ కమిటీలకు ఛైర్మన్లు నియామకం - FINANCIAL COMMITTEES IN AP ASSEMBLY
ఛైర్మన్లను అధికారికంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన స్పీకర్ - పీఏసీ, పీయూసీ, అంచనాల కమిటీల ఛైర్మన్లను నియమిస్తూ నోటిఫికేషన్
financial committees (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2025, 4:24 PM IST
మూడు ఫైనాన్షియల్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఫైనాన్షియల్ కమిటీల నియామకం పూర్తైనట్టు స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఒక్కో కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎమ్మెల్సీల చొప్పున మొత్తం 12 మందిని ఎన్నిక ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు.
తొలిసారి పీఏసీ ఛైర్మన్ ఎన్నిక - బలం లేకపోయినా వైఎస్సార్సీపీ నామినేషన్