ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇలాంటి కూతురిని కనొద్దు - ఇద్దరు ప్రియులతో కలసి తండ్రిని చంపిన యువతి - DAUGHTER KILL FATHER - DAUGHTER KILL FATHER

Daughter Kill His Father in Marriage Issue: ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నారన్న కోపంతో కన్నతండ్రిపైనే దాడి చేసి కడతేర్చింది ఆ కుమార్తె. తన తండ్రి కాలుజారి కింద పడటంతో గాయాలయ్యాయని నమ్నించే ప్రయత్నం చేసింది. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆమె గుట్టు బయటపడింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Daughter Kill His Father in Marriage Issue
Daughter Kill His Father in Marriage Issue (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 10:53 AM IST

Updated : Jun 22, 2024, 9:26 PM IST


Daughter Kill His Father in Marriage Issue : తనను ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నారన్న కోపంతో కన్న తండ్రినే హత్య చేసింది ఆ కుమార్తె. ఈ ఘటన ఈ నెల 13న అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది, ఈ హత్య కేసు వివరాలను డీఎస్పీ ప్రసాదరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

మదనపల్లె పీఅండ్‌టీ కాలనీకి చెందిన దొరస్వామి (62) దిగువ కురవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో బీఎస్సీ, బీఈడీ చదివిన తమ ఏకైక కుమార్తె హరితతో కలిసి సొంతింట్లో ఉంటున్న దొరస్వామి కుమార్తె వివాహం కోసం దాచిన మొత్తాన్ని ఆమె బ్యాంకు ఖాతాలోనే వేశారు. తల్లి నగలను సైతం ఆమెకే అప్పగించారు. ఈ నేపథ్యంలో హరిత మదనపల్లెకు చెందిన రమేశ్‌తో సన్నిహితంగా ఉంటూ అతనికి తన బంగారు నగలు అప్పగించింది. అతను వాటిని తాకట్టు పెట్టి రూ.11.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. రమేశ్ తో పాటు సాయికృష్ణ అనే మరో యువకుడికి రూ.8లక్షలు ఇచ్చిన హరిత.. ఆ ఇద్దరు యువకులు మాత్రమే గాకుండా హరీశ్‌రెడ్డి అనే మరో వ్యక్తితోనూ సన్నిహితంగా ఉంటోంది అని డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపారు.

ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన ఇల్లాలు- నిద్రమాత్రలు ఇచ్చి ఉరేసుకున్నట్లు చిత్రీకరణ - WIFE KILLED HUSBAND

ఇరుగు పొరుగు ద్వారా కూతురు వ్యవహారాలు తెలుసుకున్న హరిత తండ్రి దొరస్వామి ఆమెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వివాహానికి హరిత నిరాకరించగా ఈ విషయమై నెల రోజులుగా తండ్రీ, కుమార్తెల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 13న క్షణికావేశానికి గురైన హరిత ఇంట్లోని చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళంకప్ప, కర్రతో విచక్షణా రహితంగా తండ్రి దొరస్వామి తలపై దాడి చేసిందని, తీవ్రగాయాల పాలైన ఆయన మృతి చెందారని డీఎస్పీ వెల్లడించారు.

'నిందితుడికి శిక్ష పడాలి'- నటుడు దర్శన్​ కేసులో కన్నడ​ స్టార్స్ షాకింగ్​ రియాక్షన్! - Actor Darshan Murder Case

అరుపులు విని చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా, దొరస్వామి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తన తండ్రి కాలుజారి కింద పడటంతో గాయాలయ్యాయని హరిత వారికి చెప్పడం గమనార్హం. తరువాత పోలీసులకూ అదే విషయాన్ని తెలిపింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి హరితే హత్య చేసినట్లుగా నిర్ధారించారు. నిందితురాలిని సోమవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

మదనపల్లి హత్య కేసులో ఏడుగురు అరెస్ట్​ - రిమాండ్‌కు తరలింపు - Police Arrested Seven Accused

Last Updated : Jun 22, 2024, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details