ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాచర్లలో దారుణం - కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి కుమార్తెపై అత్యాచారం - FATHER RAPED DAUGHTER - FATHER RAPED DAUGHTER

Father Raped Daughter in Macherla : బాసటగా నిలవాల్సినవాడే బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేశాడు. మానవ మృగాల నుంచి రక్షించాల్సినవాడే రాక్షసుడిగా మారాడు. కన్నబిడ్డను కాపాడాల్సిన వాడే కాలసర్పంగా మారాడు. వావివరుసలు మరిచి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మాచర్లలో జరిగింది.

father_raped_daughter_in_macherla
father_raped_daughter_in_macherla (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 1:04 PM IST

Updated : Aug 28, 2024, 2:52 PM IST

Macherla Man Rapes Daughter : నేటి సమాజం ఎటువైపు అడుగులు వేస్తుందో అర్థం కావడం లేదు. మానవ సంబంధాలు మరిచిపోయి కొందరు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. ఆ బాలిక మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి వేయరాని చోట చేతులు వేస్తుంటే ఆ చిట్టి తల్లికి తెలియలేదు. ఇది గమనించిన తల్లి 'ఇదా నీ అసలు రూపం' అని భర్తను అసహ్యించుకుంది. ఈ క్రమంలోనే ఆ తల్లి రెండేళ్ల క్రితం ఇద్దరు ఆడపిల్లలతో పుట్టింటికి చేరింది.

Rape Cases in AP :ఇటీవల రెండు నెలల కిందట ఆ కామాంధుడు మారీచుడి వేషం వేసి మారినట్లు భార్యాపిల్లలను నమ్మించాడు. పెద్దల ముందు ఇక వారిని బాగా చూసుకుంటానని నమ్మబలికి ఇంటికి రప్పించాడు. రోజూ రాత్రిపూట కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి వారికి తాగించాడు. ఇదంతా ప్రేమే అనుకుని వారు నమ్మి తాగేవారు. మత్తులో నిద్రపోయిన వేళ అతడిలోని రాక్షసుడు బయటకు వచ్చేవాడు. అమ్మ, నాన్న చెంత ఉన్నారన్న భరోసాతో నిద్రపోతున్న కూతురిపై రోజూ అతడు అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ దారుణ ఘటన మాచర్లలో మంగళవారం వెలుగులోకి వచ్చింది.

మాచర్లకు చెందిన ఓ వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. అతడికి వెల్దుర్తి మండలానికి చెందిన మహిళతో ఆరు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. రెండేళ్ల కిందట తన మూడేళ్ల పెద్ద కుమార్తెతో భర్త అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని భార్య గమనించింది. భర్త తీరుతో వేదనకు గురైంది. మనస్తాపంతో పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. రెండు నెలల కిందట అతను పెద్ద మనుషుల ద్వారా పంచాయితీ పెట్టించాడు.

తాను మారానని ఇకపై ఎలాంటి తప్పు చేయనని నమ్మబలికాడు. ఇలా భార్యను తిరిగి మాచర్లకు తీసుకొచ్చాడు. అయినా అతని తీరులో మార్పు రాలేదు. పదిరోజులుగా రాత్రి వేళల్లో అతడు కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి భార్య, కుమార్తెకు తాగిస్తూ వచ్చాడు. ఆపై కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం వేళల్లో ఆ చిన్నారి మూత్ర విసర్జనకు వెళ్లి బాధతో ఏడుస్తుంది. అనుమానం వచ్చిన ఆ తల్లి బిడ్డను తీసుకుని ఆసుపత్రిలో పరీక్షలు చేయించింది.

నిందితుడిపై పోక్సో కేసు : అక్కడి వైద్యులు బాలికపై అత్యాచారం జరిగిందని చెప్పడంతో దిగ్భ్రాంతికి గురైంది. తన భర్తే అఘాయిత్యానికి పాల్పడ్డాడని గ్రహించింది. అతడిని కఠినంగా శిక్షించాలని ఆమె మంగవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బాపట్ల జిల్లాలో దారుణం - మైనర్​ బాలికపై గ్యాంగ్​ రేప్​ - Rape on Minor Girl in Bapatla

అవనిగడ్డలో దారుణం - ఎస్సీ బాలికపై కబడ్డీ కోచ్ అత్యాచారం - Kabaddi Coach Rape on Girl

Last Updated : Aug 28, 2024, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details