Farmer Pulling 125 Sacks of Sorghum with Bullock Carts:గతంలో రైతులకు ఎడ్ల బండ్లే ప్రధాన రవాణా సాధనంగా ఉండేవి. ఎక్కడికి వెళ్లాలన్నా ఎంత దూరమైనా ఎడ్ల బండి మీదే ప్రయాణం సాగించేవారు. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో రకాల వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, నేటికీ చాలా మంది రైతులు పల్లెల్లో తమ వడ్ల బస్తాలు ఇంటికి చేర్చడానికి, అలాగే ఎరువుల బస్తాలు పొలానికి తరలించడానికి ఎడ్ల బండ్లనే ఉపయోగిస్తున్నారు. అలానే అనంతపురం జిల్లాలో ఓ రైతు తన వద్ద ఉన్న జొన్న బస్తాలను తరలించడానికి ఒక చక్కటి ఉపాయం చేశారు. ఈ ఉపాయం ద్వారా ఒకేసారి అన్ని బస్తాలను ఇంటికి తరలించారు.
జిల్లాలోని విడపనకల్లులో బోయ అశోక్ అనే రైతు 125 జొన్న బస్తాలను ఐదు ఎడ్లబళ్లలో వేసి లాగించారు. బండెనక బండి కట్టి ఒక ఎద్దుతో బళ్లను నడిపించారు. సుమారు 2 కిలోమీటర్ల వరకు బండిని నడిపారు. అయితే ఐదు ఎడ్ల బండ్లను ఒకేసారి లాగుతున్న దృశ్యాన్ని చూడడానికి హావళిగ పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలా మంది గ్రామ ప్రజలు తరలి వచ్చారు. ఒకవైపు ఎద్దు, మరొవైపు మనుషుల ఐదు బండ్లను లాగుతున్న దృశ్యాన్ని చూసి ఆనందంతో కేకలు వేస్తూ ఉత్సాహంగా బండి వెనుక తరలి వెళ్లారు.
ఇద్దరు గురుకుల విద్యార్థులు కిడ్నాప్ - ఆడుకుంటుండగా ఎత్తుకెళ్లిన దుండగులు