Farmer Problems Due to Handri Neeva Anantapur District :అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా మండలంలోని పాత కొత్తచెరువు, వైటీ చెరువులకు నీరు అందిస్తున్నారు. ఈ క్రమంలో నైసర్గికంగా ఉన్న వంకలు, బ్రాంచ్ కెనాల్ ద్వారా నీరు చెరువులకు చేరుతోంది. అయితే ఈ నీరే గుంతకల్లు మండలం చెన్నప్ప కొట్టాలలో వ్యవసాయ పొలం ఉన్న అబ్దుల్ సలాం అనే రైతు పాలిట శాపంగా మారింది. పొలం పక్కనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ నీరు మొత్తం అతని పొలంలో వచ్చి చేరుతూ ఉండడంతో పంట పెట్టుకునే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నాడు అబ్దుల్.
కృష్ణా జలాల తరలింపు - రైతులతో వైఎస్సార్సీపీ నాయకుల వాగ్వాదం
Handri Neeva Anantapur : అధికారులు సరైన కాలువల సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో అతడికున్న ఆరు ఎకరాలలో పంట వేసుకునే అవకాశం లేకుండా పోతోందని వాపోతున్నాడు. ఏదైనా పంట వేసినా కాలువలోని నీరంతా పొలంలోకి వచ్చి చేరడంతో పంట మొత్తం కుళ్లి పోతోందని ఆవేదన చెందుతున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ పది సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తలహసీల్దారు స్థానిక నాయకులతో కలిసి తన గోడు విన్నవించుకున్నా ఏ అధికారి ఇప్పటివరకు అతనికి పరిష్కారం చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు అబ్దుల్.
హంద్రీనీవా నీటిని కుప్పం తరలిస్తున్నారు - మంత్రి పెద్దిరెడ్డిపై 'అనంత' రైతుల ఆగ్రహం