ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెజ్‌లో వాటాలు గుంజుకున్న కేసులో కొత్త కోణాలు - KAKINADA SEZ CASE UPDATES

పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్‌ఎల్‌పీ కంపెనీకి విజయసాయితో సంబంధాలు

false_auditing_in_kakinada_sez
false_auditing_in_kakinada_sez (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2024, 9:00 AM IST

False Information in Auditing Kakinada SEZ :కాకినాడ పోర్టు, సెజ్‌లో వాటాలు గుంజుకున్న కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ సీపోర్ట్‌పై ఆడిటింగ్‌ కోసం నియమించిన పీకేఎఫ్​(PKF) శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్​ఎల్​పీ (LLP) సంస్థ వైఎస్సార్సీపీ ఎంవీ విజసాయిరెడ్డి నామినేయేనని సీఐడీ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేశారంటూ తప్పుడు నివేదికలిచ్చిన పీకేఎఫ్​ శ్రీధర్‌ అండ్‌ సంతానం సంస్థ పోర్ట్‌ అరబిందోపరం కాగానే ఆ మొత్తాన్ని కేవలం రూ. 9 కోట్లకు తగ్గించేసింది.

వైఎస్సార్సీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్స్‌ లిమిటెడ్‌-KSPL, కాకినాడ సెజ్‌ల్లోని రూ.3,600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులైన పీకేఎఫ్ ​శ్రీధర్‌ అండ్‌ సంతానం LLPఆడిట్‌ కంపెనీ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నామినీయేనని సీఐడీ గుర్తించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని తేల్చింది.

KSPLలో కేవీ రావుకు చెందిన కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌-KIHPLకు ఉన్న 41.12 శాతం వాటాను ఎలాగైనా లాక్కోవాలనే కుట్రలో భాగంగానే స్పెషల్‌ ఆడిట్‌ కోసం పీకేఎఫ్​ శ్రీధర్‌ అండ్‌ సంతానం LLPకంపెనీని ఎంచుకున్నారు. ఈ నిర్ణయం నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు, విజయసాయిరెడ్డి కలిసి తీసుకున్నట్లు CIDనిర్ధారణకు వచ్చింది. ‘రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న పోర్టులన్నింటిలోనూ పీకేఎఫ్​ శ్రీధర్‌ అండ్‌ సంతానం LLPకంపెనీతో స్పెషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తున్నట్లు 2019 నవంబరు 13న YCP ప్రభుత్వం మెమో జారీ చేసింది. కానీ మిగతా PPPపోర్టుల్లో ఎక్కడా ఆడిట్‌ సాగలేదు.

కేవలం కాకినాడ సీపోర్ట్‌లోనే చేపట్టారు. ఆ నివేదిక అడ్డం పెట్టుకునే అందులోని వాటాలు లాక్కున్నట్లు CID ప్రాథమికంగా గుర్తించింది. కేవలం కాకినాడ సీపోర్టుపైనే స్పెషల్‌ ఆడిట్‌కు ఆదేశిస్తే, దురుద్దేశం తెలిసిపోతుందనే ఉద్దేశంతోనే మిగతా పీపీపీ పోర్టుల్లోనూ ఆడిట్‌కు ఆదేశించినట్లు మెమో ఇచ్చారని నిర్ధారణకు వచ్చింది. అప్పట్లో ఏం జరిగిందనేదానిపై సంబంధీకులందర్నీ విచారించి, వాంగ్మూలాలు నమోదు చేస్తోంది.

కాకినాడ పోర్టు కేసు - హైకోర్టులో విక్రాంత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

రాష్ట్ర ప్రభుత్వానికి వాటాగా చెల్లించాల్సిన మొత్తంలో 965 కోట్ల రూపాయలను KSPL ఎగవేసిందంటూ 2020 మార్చి 30న పీకేఎఫ్​ శ్రీధర్‌ అండ్‌ సంతానం సంస్థ ఫ్యాబ్రికేటెడ్‌ నివేదిక సమర్పించింది. దానిపై 30 రోజుల్లోగా అభిప్రాయాలు చెప్పాలంటూ 2021 జనవరి 1న KSPLకు ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈఓ లేఖ రాశారు. పీకేఎఫ్​ శ్రీధర్‌ అండ్‌ సంతానం LLP నివేదికలోని అభ్యంతరాలన్నింటికీ KSPL సమగ్ర వివరణలు పంపింది.

ఐతే అవి ఆమోదించదగ్గవి కాదంటూ మారిటైంబోర్డ్‌ తిరస్కరించింది. కానీ KSPLలోని 41.12 శాతం వాటాలు అరబిందో పరం అయ్యాక KSPL గతంలో పంపించిన వివరణలు, సమాధానాలనే ఆడిట్‌ సంస్థ అంగీకరించింది. అంతేకాదు ప్రభుత్వానికి ఎగవేశారన్న 965 కోట్ల మొత్తాన్ని 9 కోట్ల 3లక్షలకు కుదించి మరో నివేదిక ఇచ్చినట్లు CIDగుర్తించింది. కొద్ది నెలల వ్యవధిలోనే ఆడిట్‌ నివేదికలో అన్ని వందల కోట్ల వ్యత్యాసం చూపడంపై సీఐడీ ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది.

కాకినాడ సెజ్​లో ఎకరం 29 వేలేనా? - జగన్​ని A1గా చేర్చాలి: ఆనం

ABOUT THE AUTHOR

...view details