ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ ఐడీలు, ఆఫర్​ లెటర్లు- లక్షలు పోసి టీటీడీలో ఉద్యోగాలు కొన్న అమాయకులు - Fake Jobs in TTD In YSRCP Regime

Fake ID Cards And Joining Letters on TTD Jobs During YSRCP Regime : వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అన్యాయాలను ప్రజలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. భూ కబ్జాలు, అక్రమాలు, అరాచకాలను యథేచ్ఛగా సాగించిన వారు టీటీడీని కూడా వదలలేదు. అప్పటి మంత్రులు రోజా, అనిల్​ యాదవ్​ల పేర్లు చెప్పి తమను మోసం చేశారని బాధితులు వాపోతున్నారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 5, 2024, 5:36 PM IST

fake_id_cards_and_joining_letters_on_ttd_jobs
fake_id_cards_and_joining_letters_on_ttd_jobs (ETV Bharat)

Fake ID Cards And Joining Letters on TTD Jobs During YSRCP Regime : ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ నేతల అక్రమాలకు, అరాచకాలకు బలైపోయిన వారు జనసేన వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్‌ల పేర్లు చెప్పి టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేశారని విజయవాడకు చెందిన మహిళ జనసేన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సుమారు 40మంది నుంచి ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తమకు డబ్బు తిరిగి ఇప్పించాలని కోరారు. ఒక్కొక్కరి దగ్గర సుమారు ఐదు నుంచి నాలుగువేల రూపాలు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నాగలూరులో తన 5 ఎకరాల భూమిని చిన్నాన్నతో కలిసి వైఎస్సార్సీపీ నాయకులు కబ్జా చేశారని పల్లపు మంజునాథ జనసేన పార్టీ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2024 జనవరిలో పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్లకు సంబంధిన పోస్టులను తీయడంలోనూ తమకు అన్యాయం చేశారని బాధితులు వాపోయారు.

YSRCP Fraud ON TTD Jobs : తమకు ఉద్యోగం వచ్చిందని నమ్మించడానికి జాయినింగ్​ లెటర్​ సహా ఐడీ కార్డులు కూడా ఇచ్చారని బాధుతులు తెలిపారు. వాటిపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సంతకాలు ఉన్నట్లు బాధితులు పేర్కొన్నారు. అయితే దీని వెనుక ఉన్నది ఎవరనేది తెలుసుకోవాలని జనసేన ఎమ్మెల్యే పోలీసులకు సూచించారు.

JSP Grievance in Guntur :ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తమకు డబ్బు ఇప్పించాలని బాధితులు కోరారు. దీనిపై స్పందించిన నెలిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి విజయవాడ సీపీతో ఫోన్లో మాట్లాడి న్యాయం చేయాలని కోరారు. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆదివారం పెద్దఎత్తున జనసేన కార్యాలయానికి వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చేస్తామని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి హామీ ఇచ్చారు.

తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై దృష్టి పెట్టాలి - ఎమ్మెల్యేలకు పవన్​ కల్యాణ్​ దిశానిర్దేశం - Pawan Kalyan Meet in JSP MLAs
ఉప ముఖ్యమంత్రి పదవిపై జనసేనాని ఆసక్తి - Pawan Interested Deputy CM Post

ABOUT THE AUTHOR

...view details