ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అధికంగా వసూళ్లు చేయడం బాధాకరంగా ఉంది' - సీఎం నిర్ణయంపై ఎగ్జిబిటర్ల స్పందన - FILM CHAMBER MEETING

సంధ్య థియేటర్‌ ఘటన నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్‌ కీలక సమావేశం - సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న సంఘం

_film_chamber_meeting
_film_chamber_meeting (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 8 hours ago

Exhibitors Association Welcomes CM Revanth Decision: ఒక్కో సినిమాకు ఒక్కోరకంగా టికెట్‌ ధరలు పెంచడం వల్ల సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్‌ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ఈ క్రమంలో టికెట్ల రేట్ల విషయమై సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని ఏపీ ఎగ్జిబిటర్లు కూడా స్వాగతించారు. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది.

కొత్త సినిమా విడుదలైన రెండు, మూడు రోజులు అభిమానులు, కాలేజ్‌ స్టూడెంట్స్‌, యువత, మాస్‌ ఎక్కువగా చూస్తారని ఇలా టికెట్‌ ధరలు పెంచి, వారి నుంచి అధికంగా వసూళ్లు చేయడం బాధాకరంగా ఉందని ఎగ్జిబిటర్స్ అన్నారు. అన్ని సినిమాలకు నిర్ణీత మొత్తంలోనే టికెట్‌ ధరలు ఉండేలా చూడాలని తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌ దిల్‌రాజును కోరినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

'సంధ్య థియేటర్‌ ఘటనపై ప్రశ్నలు' - సారీ చెప్పిన సీవీ ఆనంద్

ప్రీమియర్‌ షోల పేరిట రూ.1200 టికెట్‌ ధర పెడితే, అదే ధర ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారని ఇటీవల విడుదలైన ‘పుష్ప’ విషయంలో కూడా అనేక రకాలుగా ధరలు నిర్ణయించారని అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది ఆంధ్రా ఎగ్జిబిటర్లు, నిర్మాతలు స్వాగతించారు. ఇది సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు మరో నాలుగేళ్ల పాటు ప్రాణం పోసినట్లు ఉంటుందని తెలిపారు. ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూసి డబ్బులు రావాలనుకోవాలని కానీ, తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు వసూలు చేయలన్న నిర్మాతల నిర్ణయం సరైనది కాదని ఎగ్జిబిటర్లు అన్నారు.

బెనిఫిట్‌ షోలు, రేట్లు పెంచవద్దని తాము డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. సినిమా నిర్మాణ ఖర్చు ఎక్కువ అయిందని రేట్లు పెంచుతున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు కానీ, థియేటర్‌లో ఆక్యుపెన్సీ తగ్గుతోందని వాపోతున్నారు. ఏపీ ప్రభుత్వానికి కూడా వినతి పత్రం ఇచ్చామని బెనిఫిట్‌ షోలకు అధిక రేట్లు వద్దని కోరినట్లు తెలిపారు. పెంచిన టికెట్‌ రేట్ల భారం మొత్తం ప్రేక్షకుల మీదే పడుతోందని అన్నారు. ఏడాదిలో 80 శాతం మిడిల్‌ బడ్జెట్‌ సినిమాలు వస్తున్నాయని పెద్ద బడ్జెట్‌ సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు ఆ ఒక్క సినిమానే చూసి మరో దానికి వెళ్లడం లేదని దీంతో చిన్న, మిడ్‌ రేంజ్‌ సినిమాలు దెబ్బ తింటున్నాయని అన్నాురు.

'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - సీఎం రేవంత్ రెడ్డి

'అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - లోపలికి చొరబడి పూలకుండీలు ధ్వంసం'

ABOUT THE AUTHOR

...view details