TTD EO on Vaikuntha Dwara Darshanam Arrangements: శ్రీవారి బ్రేక్ దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి వారానికి రెండు సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో టీటీడీపై జరిగే అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఇక ఆన్లైన్, ఆఫ్ లైన్ కింద ప్రస్తుతం కేటాయించే శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోటాను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచే ఉద్దేశం లేదని ఈవో తేల్చి చెప్పారు.
ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలపై న్యాయ సలహా కోరామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి పరకామణిలో జరిగిన దోపిడీ కేసుకు సంబంధించి విజిలెన్స్ అధికారులు విచారణ పూర్తి చేశారని, త్వరలో నివేదిక అందజేస్తారని చెప్పారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 31 మంది భక్తులు టెలిఫోన్ ద్వారా ఈవోకు పలు సూచనలు, ఫిర్యాదులు అందజేశారు. శ్రీవారి ఆలయంలో మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఈవోకు ఫిర్యాదు చేశారు.
సమస్యలు చాలా ఉన్నాయి : అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కల్యాణ్ స్పందన
వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు: వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసామని జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని, జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 10, 11, 12వ తేదీలకు సంభందించి 1.20 లక్షల ఎస్ఎస్డీ టోకన్లను తిరుపతిలోని 83, తిరుమలలోని 9 కౌంటర్లు ద్వారా మంజూరు చేస్తామని ఈవో తెలిపారు. ఆ 10 రోజులకు సంభందించి ఇప్పటికే 1.40 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 19,500 శ్రీవాణి దర్శన టికెట్లను భక్తులు ఆన్లైన్లో కొనుగోలు చేసారని చెప్పారు. ఆ 10 రోజులు దాతలను కూడా రూ.300 ప్రవేశ దర్శన క్యూ లైన్లో మాత్రమే అనుమతిస్తామని, జనవరి 8వ నుంచి 19వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు రద్దు చేసినట్లు చెప్పారు.
సిఫార్సు లేఖలు స్వీకరించబడవు:వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, విఐపీ బ్రేక్ దర్శనాలకు 10 రోజులు పాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడదని, ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే మాత్రమే బ్రేక్ దర్శనం కేటాయిస్తామని చెప్పారు. ఇక గడిచిన నవంబర్ నెలలో శ్రీవారిని 20.37 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, భక్తుల కానుకలు ద్వారా రూ.113 కోట్లు శ్రీవారికి హుండీ ఆదాయం సమకూరిందని, 97 లక్షలు లడ్డూలు విక్రయం చేసినట్టు, 7.31 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు ప్రకటించారు.
వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు - టీటీడీపై జరిగే అసత్య ప్రచారాలను నమ్మవద్దు: ఈవో (ETV Bharat) ఈ చంద్రబాబుకు అభిమానిని అయ్యా- వైరల్ వీడియోను షేర్ చేసిన మంత్రి లోకేశ్
ఇది వైఎస్సార్సీపీ రాజ్యం అనుకుంటున్నారా? - తోలు తీసి కూర్చోపెడతా ఖబడ్దార్ : పవన్ కల్యాణ్