తెలంగాణ

telangana

ETV Bharat / state

తుంగభద్ర ఉత్కంఠకు తెర -19వ గేటుకు స్టాప్‌లాగ్‌ను అమర్చిన ఇంజినీర్లు - TUNGABHADRA STOPLOG GATE INSTALLED

Tungabhadra stoplog Gate Installed : తుంగభద్ర జలాశయంలో ఇంజినీరింగ్ అద్భుతం జరిగింది. డ్యాం గేటు కొట్టుకుపోయి ప్రవాహం ఉండగానే, స్టాప్‌లాగ్ గేటు అమర్చిన ఘనత ఇంజినీర్లకు దక్కింది. మూడు రాష్ట్రాల ఉమ్మడి జలాశయంగా ఉన్న తుంగభద్ర డ్యాంలో ఈనెల 10న ప్రవాహంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో భారీ వరద ఉండగానే స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేశారు.

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 7:46 PM IST

Updated : Aug 17, 2024, 9:14 PM IST

Thungabhadra Dam Repair Updates
Thungabhadra stoplog Gate Installed (ETV Bharat)

Tungabhadra Dam Repair Updates : ఎట్టకేలకు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఇవాళ తుంగభద్ర జలాశయంలో ఇంజినీరింగ్ అద్భుతం జరిగింది. డ్యాం గేటు కొట్టుకుపోయి ప్రవాహం ఉండగానే, స్టాప్‌లాగ్ గేటు అమర్చిన ఘనత ఇంజినీర్లకు దక్కింది. మూడు రాష్ట్రాల ఉమ్మడి జలాశయంగా ఉన్న తుంగభద్ర డ్యాంలో ఈనెల 10న ప్రవాహంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో భారీ వరద ఉండగానే స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేశారు. 5 ఎలిమెంట్లూ అమర్చడంలో ఇంజినీర్లు విజయవంతమయ్యారు.

నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ఒక్కో ఎలిమెంటును అత్యంత సాహసంతో అమర్చి వృథాగా పోతున్న నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. ఐదు ఎలిమెంట్ల ఏర్పాటుతో జలాశయం పూర్తిగా నిండినా, 19వ గేటు నుంచి నీరు దిగువకు వెళ్లే మార్గం లేకుండా ఈ స్టాప్ లాగ్ గేటు ప్రవాహాన్ని అడ్డుకోనుంది. జలాశయ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో అత్యంత సాహసంతో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటును పూర్తి చేశారు. ఇది ఇంజినీరింగ్ అద్భుతంగా నిపుణులు చెబుతున్నారు.

అసలేెం జరిగిందంటే : కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్‌ గేటు వరదల ధాటికి కొట్టుకుపోయింది. ఈనెల పదో తారీఖు శనివారం రాత్రి డ్యాం గేటు చైన్‌ లింక్‌ తెగిపోవడం వల్ల 19వ గేటు కొట్టుకుపోయింది. డ్యాం గేట్లను పరిశీలించిన ఇరు రాష్ట్రాల నేతలు, జలాశయం మరమ్మతులకు అధికారులను ఆదేశించారు. ఎంత ఖర్చైనా వెనుకడకుండా నీటి వృథాను ఆపాలని స్పష్టం చేశారు. గేట్ల పునరుద్ధరణకు కన్నయ నాయుడు నేతృత్వంలో పని ప్రారంభించారు.

తుంగభద్ర గేటు 19 వ గేటు కొట్టుకుపోయి ఇప్పటి వరకు 33 టీఎంసీల జలాలు వృథాగా నదికి పారాయి. గేటు కొట్టుకుపోయిన రోజు జలాశయంలో 105 టీఎంసీల నీటి నిల్వ ఉండేది. శుక్రవారం నాటికి జలాశయంలో 72 టీఎంసీలే ఉన్నాయి. మొత్తం 33 గేట్లలో 25 గేట్ల ద్వారా 86,310 క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 33,419 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

వరదల ధాటికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

తుంగభద్ర డ్యామ్ గేటు ఘటన - జూరాల ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు!

Last Updated : Aug 17, 2024, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details