Election Campaign in AP : ఎన్నికల సమయం దగ్గర పడటం, ప్రత్యర్థులు ఎవరనేది తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతున్నారు. ర్యాలీలు, సమావేశాలతో జనాన్ని సంఘటితం చేస్తున్నారు.
Srikakulam District :శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం ప్రచార జోరు పెంచింది. బూర్జ మండలం డొంకలపర్తిలో ఆమదాలవలస అసెంబ్లీ అభ్యర్థి కూన రవికుమార్ ఇంటింటి ప్రచారం చేశారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. విజయనగరం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం అభ్యర్థులు ప్రచారాలు చేపట్టారు. కురుపాం నియోజకవర్గంలో తోయక జగదీశ్వరీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
పార్వతీపురంలో విజయ్ చంద్ర, సాలూరులో గుమ్మడి సంధ్యారాణి ప్రచారం చేశారు. రాజాంలో కూటమి అభ్యర్ధి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో శివ్వాం గ్రామానికి చెందిన 25 ఎస్సీ కుటుంబాలు, రేగిడి మండలం సోమరాజు పేట గ్రామానికి చెందిన 60 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. గజపతినగరంలో కొండపల్లి శ్రీనివాసరావు, బొబ్బిలిలో బేబినాయన ప్రచారం చేశారు. అటు వైసీపీ అభ్యర్థులు సైతం జోరుగా ప్రచారం సాగించారు. సాలూరులో మంత్రి పీడిక రాజన్నదొర, బొబ్బిలిలో చిన అప్పలనాయుడు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. రహదారి దుస్థితిపై డొంగురువలసకు చెందిన మహిళలు శంబంగి అప్పలనాయుుడిని నిలదీశారు.
కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల పింఛన్: చంద్రబాబు - Chandrababu Tour In Kuppam