ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంస్థల్లో రూ. 300కోట్ల మేర అక్రమాలు- ఈడీ కీలక ప్రకటన - ed raids in mla house

ED Keynote on MLA House Raids : తెలంగాణలోని పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి మైనింగ్ ద్వారా అక్రమాలు కొనసాగించారని ఈడీ పేర్కొంది. సంతోష్‌ శ్యాండ్, సంతోష్‌ గ్రానైట్ కంపెనీల ద్వారా మొత్తంగా రూ.300 కోట్ల మేర మైనింగ్‌ అక్రమాలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ED Keynote on MLA House Raids
ED Keynote on MLA House Raids (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 10:45 PM IST

ED Keynote on MLA House Raids : మైనింగ్‌లో తెలంగాణ ప్రభుత్వానికి పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి రూ.39 కోట్లు నష్టం చేకూర్చినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గుర్తించారు. మొత్తం రూ.300 కోట్ల మేర మైనింగ్‌ అక్రమాలు జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. సంతోశ్ శ్యాండ్, సంతోశ్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు కొనసాగించారని ఈడీ పేర్కొంది.

తొలిరోజు సందడిగా శాసన సభ- చంద్రబాబు, పవన్​, జగన్​ ఎలా స్పందించారంటే!

మైనింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన మహిపాల్‌రెడ్డి సోదరుల నివాసాల్లో సోదాల సమయంలో ఈడీ 19 లక్షల రూపాయల నగదు గుర్తించింది. ఈ మేరకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసాల్లో జరిగిన సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్‌, హవాలా నేపథ్యంలో సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు.

స్పీకర్‌ పదవికి ఒకే ఒక్క నామినేషన్ ​- అయ్యన్న ఎన్నిక లాంఛనమే

బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్టు ఈడీ వివరించింది. బినామీ పేర్లతో లావాదేవీలనూ ఈడీ గుర్తించింది. మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని, మహిపాల్‌రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్టు బయటపడిందని అధికారులు పేర్కొన్నారు.

రెండో రోజే శాసనసభకు రాకూడదని వైఎస్సార్​సీపీ నిర్ణయం - YSRCP Not to Come Assembly

ABOUT THE AUTHOR

...view details