EC Questioned State Govt on Deposit of Scheme Funds:పోలింగ్ తేదీకి ముందు సంక్షేమ పథకాల డబ్బు జమ చేయాలన్న వైసీపీ కుట్రలకు ఈసీ (Election Commission) అడ్డుకట్ట వేసింది. పోలింగ్‌కు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు వేసి ఓటర్లకు ఎర వేయాలని జగన్ కుయుక్తులు పన్నారు. అయితే దీన్ని తిప్పికొట్టేలా డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల సంఘం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు పథకాలకు సంబంధించి నిధుల విడుదల పోలింగ్‌కు ముందు జరగకుండా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు ముగిసే వరకు లబ్ధిదారులకు పథకాల సొమ్మును జమ చేయొద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్ద సీబీఐ - ముగిసిన వాదనలు - CM Jagan Foreign Tour Petition
వాస్తవానికి ఎన్నికల కోడ్ కంటే ముందే వివిధ పథకాల కోసం ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కారు. మొత్తంగా ఆరు పథకాలకు సంబంధించి 14 వేల 165 కోట్ల రూపాయలను ఎన్నికల కోడ్‌కు ముందే బటన్ నొక్కారని ఈసీ పేర్కొంది. ఆరు పథకాలకు ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారనే అంశంపై జాబితా విడుదల చేసింది. 'ఆసరా' ద్వారా 6వేల 394 కోట్ల జమకు జనవరి 23న జగన్ బటన్ నొక్కినట్లు జాబితాలో వెల్లడించింది. 'కల్యాణమస్తు' ద్వారా రూ 78.5 కోట్ల జమకు ఫిబ్రవరి 28న, 'విద్యా దీవెన' ద్వారా 708 కోట్ల జమకు మార్చి 1న బటన్ నొక్కినట్లు ఈసీ తెలిపింది. ఇన్ పుట్ సబ్సిడీ కింద 1294 కోట్ల జమకు మార్చి 6న, 'చేయూత' ద్వారా 5 వేల 60 కోట్లకు జమకు మార్చి 7న, 'ఈబీసీ నేస్తం' ద్వారా 629 కోట్ల రూపాయల జమకు మార్చి 14న జగన్ బటన్ నొక్కినట్లు ఈసీ వివరించింది.