Prakasam Dist Earthquake Today : ప్రకాశం జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముండ్లమూరు, తాళ్లూరు, శంకరాపురం, పోలవరం, పసుపుగల్లులో వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, గంగవరం, రామభద్రాపురం, శంకరాపురంలో భూప్రకంపనలు వచ్చాయి. ఈ క్రమంలోనే ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు.
పలు గ్రామాల్లో రెండు సెకండ్లపాటు భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వస్తువులన్ని కదిలాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు వచ్చామని స్థానికులు పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. జమ్మూకశ్మీర్‌లోని లద్దాఖ్‌లో 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్‌లోని జూమ్లాకు సమీపంలో భూకంప కేంద్రం. భూకంపలేఖినిపై తీవ్రత 5గా నమోదైంది.
Earthquake in Telugu States:మరోవైపు ఇటీవలేతెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, బుట్టయగూడెం, టి.నరసాపురం మండలం బొర్రాంపాలెం, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.