ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పుల తడకగానే ఓటర్ల జాబితా - తిరుపతిలో ఓకే ఇంటి చిరునామాతో 32 ఓట్లు - ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులు

Draft Voter List is Riddled With Errors in Tirupati: రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై విపక్షాల ఫిర్యాదులు, ప్రజాసంఘాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ముసాయిదా జాబితాను అధికారులు సవరించామన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా ఇంకా తప్పుల తడకగానే ఉంది. చనిపోయిన వారి ఓట్లు ఇంకా ఓట్లరుగా వారి పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయని విపక్షాల నేతలు మండిపడుతున్నారు.

Draft Voter List is Riddled With Errors in tirupati
Draft Voter List is Riddled With Errors in tirupati

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 11:00 AM IST

ఓటర్ల జాబితాలో అక్రమాలు - తిరుపతిలో ఓకే ఇంటి చిరునామాతో 32 ఓట్లు నమోదు

Draft Voter List is Riddled With Errors in Tirupati: ముసాయిదా జాబితాలో తప్పులను సవరించాం. తుది జాబితాను పారదర్శకంగా విడుదల చేశామంటూ చిత్తూరు జిల్లా అధికారులు చేస్తున్న ప్రకటనలకు వాస్తవాలకు పొంతన లేకుండా పోయింది. పరిశీలించే కొద్దీ అక్రమాలు ఇబ్బడి ముబ్బడిగా వెలుగు చూస్తున్నాయి. ముసాయిదా జాబితాకు, తుది జాబితాకు తేడాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

రెండో రోజూ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రత్యేక డ్రైవ్‌ - వైసీపీ నేతలకు రెండు, మూడేసి ఓట్లు

Irregularities of Draft List in Tirupati: ఓట్ల అక్రమాలపై విపక్షాల ఫిర్యాదులు, ప్రజాసంఘాల విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకొని ముసాయిదా జాబితాను సవరించామని అధికారులు ప్రకటించారు. కానీ తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా తప్పుల తడకగానే ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలోని 266వ పోలింగ్‌ కేంద్రంలో మృతి చెందిన 30 మందిని ఓటర్లుగా చేర్చారు. తిరుపతి నియోజకవర్గంలోని 162వ పోలింగ్‌ బూత్‌లో ఒకే ఇంటి చిరునామాతో ఏకంగా 32 ఓట్లు నమోదయ్యాయి. తిరుపతి 124వ పోలింగ్ కేంద్రం పరిధిలోని అబ్బన్న కాలనీలో ఓకే చిరునామాపై 32 ఓట్లు ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో ఉండేది మాత్రం ఓ వృద్ధురాలు, ఓ సహాయకురాలు మాత్రమే.

ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీ బృందం సమీక్ష - ఏం చర్యలు తీసుకున్నారని కలెక్టర్లకు ప్రశ్న

Draft voter list errors in Tirupati:రాష్ట్రంలోముసాయిదా ఓటర్ల జాబితాలో తప్పుగా ఉన్న ఓటర్లను సైతం తుది జాబితాలో అధికారులు చేర్చారు. అంతే కాకుండా తిరుపతి నియోజకవర్గ ఓటరు జాబితాలోని ఓటరు సంఖ్య 852 నుంచి 859 వరకు ఇంటి నంబర్‌ స్థానంలో తిరుపతి బస్టాండ్‌ అని నమోదు చేశారు. ముసాయిదా జాబితాలోని ఒకే ఇంటి చిరునామాతో ఉన్న ఓటర్లందరూ నకిలీ ఓటర్లేనని సంబంధిత డివిజన్​కు చెందిన విపక్షపార్టీల నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా తుది జాబితాలో మార్పు జరగలేదు. వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గే అధికారులు ఎలాంటి మార్పు చేయలేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఒకే ఇంటిలో 32 ఓట్లు ఉన్నాయని టీడీపీ నేత రాజేంద్ర అన్నారు. ఓట్ల అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన తెలిపారు.

చనిపోయిన వారి ఓట్లను ఎన్నికల అధికారులు తొలగించట్లేదని రాజేంద్ర అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై విపక్షాల ఫిర్యాదులు, ప్రజాసంఘాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ముసాయిదా జాబితాను అధికారులు సవరించినా, కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా ఇంకా తప్పుల తడకగానే ఉంది. చనిపోయిన వారి ఓట్లు ఇంకా ఓట్లరుగా వారి పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయని విపక్షాల నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సంఘం స్పందించి ముసాయిదా జాబితాలోని అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

కొత్త ఓటర్ల జాబితాలోనూ కుప్పలు తెప్పలుగా అవే పాత తప్పులు!

ABOUT THE AUTHOR

...view details