Dog Attacks in Nizamabad : ఉమ్మడి ఇందూర్ జిల్లాలో కుక్కల బెడద పెరిగిపోయింది. ప్రధాన రహదారులు, వీధులు, ఇళ్ల వద్ద గుంపులుగా తిరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పదుల సంఖ్యలో తిరిగే కుక్కలను చూసి ప్రజలను భయపడి పోతున్నారు. రెండు రోజుల కింద కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటలో ఇంటి బయట అరుగుపై కూర్చున్న రామవ్వ అనే వృద్ధురాలిపై వీధి కుక్కలు గుంపులుగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. నాలుగు గంటల పాటు చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందింది.
గతేడాది జూలై నుంచి డిసెంబర్‌లో 400 మందికి పైగా కుక్కలు గాయపర్చాయి. ఈ ఏడాది జనవరి నెలలో 42 మంది కుక్కల బారిన (Dogs Attack) పడి గాయలపాలయ్యారు. నెల రోజుల్లోనే 40 మందికి పైగా కుక్క కాట్లకు గురయ్యారు. ఇటీవల మాక్లూర్‌లో ఓ బాలుడు కుక్కల దాడిలో మరణించాడు. ఇలా రోజూ కుక్కల బారిన పడి చాలా మంది తీవ్రంగా గాయపడుతున్నారు. కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Stray Dogs Attack in Telangana : తెలంగాణలో డాగ్ టెర్రర్.. వీధికుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు
Nizamabad Stray Dog Attacks :జిల్లాలో కుక్కల నియంత్రణకు అధికారులు సరైన చర్యలు చేపట్టడం లేదు. నిత్యం క్కుకకాటు ప్రమాదాలు పెరుగుతున్నా, యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. గతంలో కుక్కలను పట్టుకోవడానికి ప్రత్యేక సిబ్బందిని రప్పించేవారు. ఇప్పుడా చర్యలు కనిపించడం లేదు. కామారెడ్డిలోని రామేశ్వర్‌పల్లి వద్ద శునకాల నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేసినా వైద్యులను నియమించకపోవడంతో నిరుపయోగంగా మారింది. కుక్కలు దాడికి కామారెడ్డి ఆసుపత్రిలో వైద్యం అందించలేకపోతున్నారు. దీంతో నిజామాబాద్‌కు రిఫర్ చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో బాధితుల పరిస్థితి విషమంగా మారుతోంది.