ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరుగుతున్న చలి - జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు - PRECAUTIONS IN WINTER

చలికి తట్టుకోలేకపోతున్న జనం - జ్వరం, ఒళ్లునొప్పులతో హాస్పిటల్స్​కి క్యూ - చిన్న జాగ్రత్తలు పాటించాలంటున్న డాక్టర్లు

precautions_in_winter
precautions_in_winter (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2024, 6:17 PM IST

Doctors Precautions for Winter: చలికాలం తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. చలి తాకిడికి జనం తట్టుకోలేకపోతున్నారు. దీనికి తోడు వైరస్‌ల దాడి కూడా ఎక్కువవుతోంది. జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడేవారితో హాస్పటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాల బారి నుంచి తప్పించుకోలేరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా పడిపోయే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ క్రమంలో వ్యాధుల బారిన పడేకంటే చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్య జీవన విధానాన్ని అనుసరించి ఈ శీతాకాలంతో చెలిమి చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ సర్వజనాసుపత్రి డా. సనపల నర్సింహమూర్తి, ఎండీ చెబుతున్నారు.

  • కాస్త వ్యాయామం చాలు:చలి కాలంలో ఎండ నెత్తిమీదకు వచ్చే వరకు చాలా మందికి బయటకు రావాలని అనిపించదు. అంతవరకు రోజూ వాకింగ్, యోగాకు వెళ్లేవారు సైతం బద్ధకిస్తారు. ఇది ఏ మాత్రం సరైన పద్ధతి కాదు. ఒకవైళ బయటకు వెళ్లలేకపోతే ఇంటిలోనైనా కనీసం అరగంట వ్యాయామం తప్పని సరిగా చేయాలి. అప్పుడు శరీరంలో చురుకుదనం, రోగ నిరోధకశక్తి పెరిగి వ్యాధులను తట్టుకునే శక్తి వస్తుంది.
  • గుండె ఘోష వినండి:వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గే కొద్దీ రక్తనాళాలు సంకోచిస్తాయి. దీంతో అవయవాలకు రక్తం సరఫరా చేసే గుండె మరింత బలంగా పని చేయాల్సి వస్తుంది. ఈ కారణంగా గుండె కండరానికి ఆక్సిజన్‌ నిండిన రక్త సరఫరా తగ్గడంతో హార్ట్​ఎటాక్ అవకాశాలు పెరుగుతాయి. గుండె జబ్బులు, మధుమేహ బాధితులు, రక్తపోటు ఉన్నవారికి చల్లదనం శత్రువే. కొన్నిసార్లు హృదయం మనల్ని హెచ్చరిస్తుంది. నొప్పి వంటి సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

విశాఖ ప్రజలకు గుడ్​న్యూస్ - మెట్రో ప్రాజెక్టు మొదటి దశ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం

  • గోరువెచ్చని నీరే:చల్లదనంలో ఊపిరితిత్తుల్లోని పొరలు ఎక్కువగా స్పందిస్తాయి. పొడి వాతావరణంలోకి వచ్చేసరికి దుమ్ము, ధూళి గాలిలో కలిసిపోయి అలెర్జీ, ఆస్తమా, దగ్గు, ఆయాసం లాంటివి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిన్నారులు, వృద్ధులు, పొగ తాగేవారిలో శ్వాసకోస సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు గోరువెచ్చని నీరు రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి.
  • ఆహార నియమం:బయట చల్లగా ఉందని వేడి వేడి పకోడీ, బజ్జీలు తినేస్తుంటారు. అలాంటి ఆహారాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టాలి. ఎ, సి, కె విటమిన్లు, ఫైబర్‌ అధికంగా ఉండే పాలకూర, బచ్చలి వంటివి, బీటా కెరొటిన్, నైట్రస్‌ లాంటివి ఉండే బీట్‌రూట్, క్యారట్‌లను ఆహారంగా తీసుకోవాలి.
  • వాటితో స్నేహం తగ్గిద్దాం:వైరస్‌ వ్యాప్తికి పెంపుడు జంతువులతో చెలిమి కూడా కారణమేనని వైరాలజిస్టులు అంటున్నారు. ఈ కాలంలో వాటిని బెడ్​రూం, వంట గదుల్లోకి రానీయకుండా చూసుకోవాలి. ఈ కాలంలో కొంచెం వాటితో స్నేహం తగ్గిస్తే మంచింది. చిన్నారులు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు ఈ నియమం తప్పనిసరిగా పాటించాలి.
  • అశ్రద్ధ వద్దు:చలికాలంలో వృద్ధులు, శ్వాసకోస వ్యాధులతో ఇబ్బందులు పడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు, హృద్రోగ బాధితులు తమ ఆరోగ్యంలో ఏమాత్రం తేడా కనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కూలింగ్ పదార్థాలు, పానీయాల జోలికి అస్సలు వెళ్లకూడదు. వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు తగిన పోషకాహారం తీసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details