తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 11:37 AM IST

ETV Bharat / state

కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా డీజిల్‌ రవాణా - వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి - Diesel Smuggling In Telangana

Diesel Smuggling In Telangana 2024 : వందలకోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న డీజిల్ అక్రమరవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్దమైంది. ఆరేడు సంవత్సరాలుగా జరుగుతున్న దందాకు అడ్డుకట్ట వేయడంపై దృష్టిపెట్టింది. కర్ణాటక నుంచి వస్తున్న డీజిల్‌తో సరిహద్దు ప్రాంతల్లో 20కిపైగా పెట్రోల్‌ పంపులు మూతపడ్డాయి. అక్రమ రవాణా నానాటికీ పెరిగి పోతుంటడంతో కఠిన చర్యలకు సిద్ధమైంది.

Illegal Diesel Transport In Telangana
Diesel Scam In Telangana

కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా డీజిల్‌ రవాణా - వందల కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి

Diesel Smuggling In Telangana 2024 :రాష్ట్రంలో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీఎల్ కంపెనీలకు చెందిన దాదాపు 3 వేల 600 పెట్రోల్‌, డీజిల్‌ పంపులు ఉన్నాయి. రోజూ వీటి ద్వారా 60 లక్షల లీటర్ల డీజిల్‌ విక్రయాలు జరుగుతున్నాయి. ఐతే రాష్ట్రంలో లీటర్‌ డీజిల్‌ ధర 95 రూపాయల 63 పైసలుండగా కర్ణాటకలో 85 రూపాయల 92 పైసలు ఉంది. కన్నడ నాట డీజిల్‌పై 14.34శాతం వ్యాట్‌ ఉండగా రాష్ట్రంలో మాత్రం 27శాతం వ్యాట్ ఉంది. కర్ణాటకతో పోలిస్తే రాష్ట్రంలో డీజిల్‌ రేటు దాదాపు 10 రూపాయలు ఎక్కువ.

అక్కడ ధర తక్కువ ఉండటంతో అక్రమంగా రాష్ట్రానికి డీజిల్‌ తరలిస్తున్నారు. కర్ణాటక సరిహద్దుల్లోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల వాహనదారులు ఎక్కువగా కర్ణాటక డిజిల్‌నే వాడుతున్నారు. వాహనదారులే కాకుండా వివిధ పరిశ్రమలకు చెందిన గుత్తేదారులు సైతం కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో డీజిల్‌ తెప్పించుకుంటున్నారు. ఈ కారణంగా ఆయా జిల్లాల సరిహద్దులో ఉన్న 20కిపైగా పెట్రోల్‌ పంపులు దాదాపు మూతపడ్డాయి.

రాష్ట్రంలో వ్యాట్‌ చెల్లింపులపై ప్రచ్ఛన్న యుద్ధం - వాణిజ్య, ఎక్సైజ్ శాఖల మధ్య నెలకొన్న వైరం

Illegal Diesel Transport In Telangana :కర్ణాటక నుంచి తెలంగాణకు ఇటీవల కొందరు అక్రమార్కులు ముఠాలుగా ఏర్పడి కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో డీజిల్‌ రాష్ట్రానికి తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మన దగ్గర పెట్రోల్‌ పంపుల్లో కంటే రెండు, మూడు రూపాయలు తక్కువకు డీజిల్‌ను అమ్మతున్నారు. ఇలా రాష్ట్ర ఖజానాకు వ్యాట్‌ రూపంలో రావాల్సిన సొమ్ముకు గండికొడుతున్నారు. 'పెట్రోలియం ప్లానింగ్‌ అనాలిసిస్‌ సెల్‌' అందించిన గణాంకాల ప్రకారం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణలో 3వేల 528 మెట్రిక్‌ టన్నులు డీజిల్‌ అమ్మకాలు జరరగా అదే సమయంలో కర్ణాటకలో మాత్రం 8 వేల 42 మెట్రిక్‌ టన్నులు డీజిల్‌ అమ్మకాలు జరిగాయి.

కర్ణాటక నుంచి తెలంగాణకు అక్రమంగా డీజిల్‌ రవాణా : రాష్ట్రంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగినా డీజిల్‌ విక్రయాలు మాత్రం తగ్గుతున్నాయి. అక్రమ డీజిల్‌ రవాణా ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై వస్తున్న వ్యాట్‌ ఆదాయాన్ని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ శ్రీదేవి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. కర్ణాటక నుంచి డీజిల్‌ తరలించడం ద్వారానే వందల కోట్ల మేర రాష్ట్రానికి గండిపడుతోందని ప్రాథమికంగా గుర్తించారు. వే బిల్లులు అమలు చేయడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని భావించిన వాణిజ్య పన్నుల శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది.

ఒక్క టానిక్‌ వైన్స్​లోనే రూ.1000 కోట్ల 'పన్ను ఎగవేత' లావాదేవీలు!

విదేశీ మద్యం పేరుతో భారీగా 'పన్ను ఎగవేత' - సమగ్ర విచారణకు ప్రభుత్వ ఆదేశం

ABOUT THE AUTHOR

...view details