Devotees Complain to Minister Lokesh through 'X' : విజయవాడ కనకదుర్గమ్మ దుర్గమ్మ గుడి వద్ద తాగునీటి సమస్యపై భక్తులు ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోకు మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించారు. కనకదుర్గ గుడి ప్రసాదం కౌంటర్ వద్ద నీటితో పాటు సరైన నిర్వహణ లేదని భక్తులు మంత్రి లోకేశ్‌కు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. దీంతో వెంటనే భక్తులకు కలిగిన అసౌకర్యంపై ప్రభుత్వం తరఫున క్షమాపణలు తెలియజేస్తున్నట్లు మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.
భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం తన టీం ద్వారా సమస్యను సంబంధిత శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాలతో తక్షణమే రంగంలోకి దిగిన అధికారులు, భక్తులకు కావాల్సిన మంచినీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో మంత్రి చొరవ పట్ల భక్తులు ధన్యవాదాలు తెలిపారు.