ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వారసులొస్తున్నారు'- ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా ముందడుగు! - రాజకీయాల్లోకి వారసులు

Descendants Into politics in AP Elections-2024: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా ప్రకటించిన తొలి జాబితాలో తొలిసారి బరిలో దిగుతున్నవారు ఉన్నారు. వారసత్వ రాజకీయ నేపథ్యం గల కుటుంబాల నుంచి పలువురు పోటీ చేస్తున్నారు.

Descendants Into politics in AP Elections-2024
Descendants Into politics in AP Elections-2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 1:37 PM IST

Descendants Into politics in AP Elections-2024: శాసనసభ ఎన్నికల కోసం టీడీపీ ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో పలువురు రాజకీయ నేపథ్యం గల కుటుంబాల నుంచి వచ్చిన వారున్నారు. వీరిలో చాలా మంది తొలిసారి ఎన్నికల బరిలో దిగుతుండగా, మరి కొందరికి గతంలో పోటీ చేసిన అనుభవముంది. తొలిసారి బరిలో దిగుతున్నవారు దాదాపు 20మంది వరకు ఉన్నారు.

వెనకబడిన వర్గాలకే టీడీపీ-జనసేన తొలి జాబితాలో పెద్దపీట

కొండపల్లి శ్రీనివాస్‌- గజపతినగరం: పూర్వపు బొబ్బిలి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన దివంగత కొండపల్లి పైడితల్లినాయుడు మనవడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఇన్‌ఛార్జి అప్పలనాయుడు సోదరుడి కుమారుడు శ్రీనివాస్. గతంలో శ్రీనివాస్‌ తండ్రి కొండలరావు గంట్యాడ ఎంపీపీగా పనిచేశారు.

యనమల దివ్య- తుని:మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య. ప్రస్తుతం దివ్య రామకృష్ణుడు వారసురాలిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కొంతకాలంగా తుని టీడీపీ ఇన్‌ఛార్జిగా రామకృష్ణుడు ఉన్నారు.

ఆదిరెడ్డి వాసు- రాజమహేంద్రవరం నగరం: మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనయుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడికి సొంత బావ అయిన ఆదిరెడ్డి వాసు ఈ సారి ఎన్నికల బరిలో నిలవనున్నారు.

బడేటి రాధాకృష్ణ- ఏలూరు:దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు సోదరుడు రాధాకృష్ణ. ఆయన మరణించిన తర్వాత ఏలూరు టీడీపీ ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అంబరాన్నంటుతున్న తమ్ముళ్ల సంబరాలు- విజయంపై ధీమా

వర్ల కుమార్‌రాజా- పామర్రు:టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తనయుడు కుమార్​రాజా. 2014 ఎన్నికల్లో రామయ్య పామర్రు నుంచి పోటీ చేయగా ఈసారి ఆయన తనయుడికి అవకాశం దక్కింది. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవల విజయశ్రీ. ఆమె తిరుపతిలో వైద్యురాలుగా పని చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల బరిలో నిలవనున్నారు.

రెడ్డప్పగారి మాధవి- కడప:మాజీ మంత్రి రెడ్డప్పగారి రాజగోపాల్‌రెడ్డి కోడలు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి భార్య. వారి వారసత్వంతో మాధవి ఎన్నికల బరిలో టికెట్‌ సంపాదించారు. పెనుకొండ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి కుమార్తె ఎస్‌.సవిత. ఆయన వారసత్వంతో తొలిసారి ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మడకశిర నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు ఎంఈ సునీల్‌కుమార్‌ పోటీ చేస్తున్నారు. ఆయన వారసుడిగా అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. గతంలో పోటీ చేసినా కూడా మరోసారి బరిలోకి దిగుతున్నారు.

టీడీపీ-జనసేన తొలిజాబితాలో యువ జోష్​ - 45 ఏళ్లలోపు 24 మంది

అదితి విజయలక్ష్మీ గజపతిరాజు- విజయనగరం:కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత పూసపాటి అశోక్‌గజపతిరాజు కుమార్తె. 2019 ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి విజయనగరం నుంచే బరిలో దిగుతున్నారు. బొబ్బిలి నుంచి మాజీ మంత్రి సుజయ్‌ కృష్ణరంగారావుకు సోదరుడు బేబినాయన పోటీ చేస్తున్నారు. 2014లో విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఈసారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు.

కాగిత కృష్ణప్రసాద్‌-పెడన:దివంగత మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు తనయుడు. పెడన నుంచి 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మరోసారి ఆయన అవకాశం దక్కించుకున్నారు.

తంగిరాల సౌమ్య- నందిగామ:దివంగత మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు కుమార్తె సౌమ్య . ఆయన మరణానంతరం 2014లో జరిగిన ఉపఎన్నికలో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో నందిగామ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మూడోసారి బరిలో నిలుస్తున్నారు.

నారా లోకేశ్‌- మంగళగిరి:టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు. రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. 2019లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి అక్కడి నుంచే బరిలో దిగుతున్నారు.

ఉభయగోదావరి జిల్లాలపైనే జనసేన ఫోకస్​ - భీమవరం నుంచే పవన్​ !

భూమా అఖిలప్రియ- ఆళ్లగడ్డ:దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, శోభనాగిరెడ్డి దంపతుల కుమార్తె అఖిలప్రియ. ఆమె 2014లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019లో ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి ఓడిపోయారు. మరోసారి అక్కడి నుంచే పోటీ చేయనున్నారు.

టీజీ భరత్‌- కర్నూలు:మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌ తనయుడు. 2019లో కర్నూలు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి అక్కడి నుంచే బరిలో నిలవనున్నారు.

కేఈ శ్యాంబాబు- పత్తికొండ:మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు. ఆయన వారసుడిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా మళ్లీ పత్తికొండ నుంచే పోటీ చేయనున్నారు.

జేసీ అస్మిత్‌రెడ్డి- తాడిపత్రి: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు. 2019లో తాడిపత్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మళ్లీ టికెట్‌ దక్కించుకున్నారు.

నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి- పీలేరు:మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పీలేరులో పోటీ చేసి ఓడిపోయారు. మూడోసారి అక్కడి నుంచే బరిలో దిగుతున్నారు.

గాలి భానుప్రకాశ్‌- నగరి:మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారుడు. 2019లో నగరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఆయన నగరి నుంచే బరిలో దిగనున్నారు.

ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ-జనసేన ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details