ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్నయ్య ఆపద్బాంధవుడు' - మెగాస్టార్​కి పవన్‌ బర్త్​డే విషెస్ - Pawan Kalyan Wishes to Chiranjeevi - PAWAN KALYAN WISHES TO CHIRANJEEVI

Pawan Kalyan Wishes to Megastar Chiranjeevi: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ దృష్టిలో అన్నయ్య ఆపద్బాంధవుడు అని కొనియాడారు. ఎందరికో ఆయన సాయం చేశారని, అనారోగ్యం బారినపడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకమన్నారు. అన్న ఇచ్చిన నైతిక బలం, మద్దతు అఖండ విజయాన్ని చేకూర్చాయన్న పవన్‌, తల్లి లాంటి వదినమ్మతో ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.

Pawan Kalyan Wishes to Megastar Chiranjeevi
Pawan Kalyan Wishes to Megastar Chiranjeevi (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 11:31 AM IST

Pawan Kalyan Wishes to Megastar Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన దృష్టిలో అన్నయ్య ఆపద్బాంధవుడు అని అన్నారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం తనకు తెలుసన్నారు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని, కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయని తెలిపారు. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారని, అభ్యర్ధిస్తారని పేర్కొన్నారు. ఆ గుణమే చిరంజీవిని సుగుణ సంపన్నునిగా చేసిందేమోనన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని తమ ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయన్నారు. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని అని, తల్లి లాంటి వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నానని అన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి - Chiranjeevi Tirumala Darshan

Nagababu Tweet: చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22 మెగా ఫ్యాన్స్ డే అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ట్వీట్ చేశారు. తమ సోదరుల అందరికీ తండ్రిలాంటి వ్యక్తి చిరంజీవి అని, తమను ఉన్నత స్థానంలో నిలబెట్టారని అన్నారు. తన అన్నయ్య చిరంజీవికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. చిరంజీవికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Chiranjeevi Birthday Celebrations: చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి ప్రదాత అని అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చిరంజీవి జన్మదిన వేడుకలు కృష్ణా జిల్లా, అవనిగడ్డలోని వెంకటేశ్వర థియేటర్ ఆవరణలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి కేక్ కట్ చేసి మెగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details