ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు' - పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన పవన్‌ కల్యాణ్‌ - DEPUTY CM ON SWACHH ANDHRA PROGRAM

గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన 'స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్‌' కార్యక్రమంలో పాల్గొన్న పవన్ - పారిశుద్ధ్య ట్రాక్టర్‌ను స్వయంగా నడిపిన డిప్యూటీ సీఎం

Pawan Kalyan on Swachh Andhra program in Guntur district
Pawan Kalyan on Swachh Andhra program in Guntur district (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2025, 4:31 PM IST

Pawan Kalyan on Swachh Andhra Program in Guntur district : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కరోనా వంటి పరిస్థితుల్లో శుభ్రత గురించి తెలుస్తుందన్నారు. 2047 వికసిత భారత్ లక్ష్య సాధనలో, రాష్ట్రాభివృద్ధిలో పరిశుభ్రత కీలకపాత్ర పోషిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పంచాయతీల పరిధిలో చేస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలు, డంపింగ్ యార్డు నిర్వహణను స్వయంగా పరిశీలించారు.

తొలుత డంపింగ్ యార్డ్ ఆవరణలో మొక్కలు నాటిన పవన్ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో చేపట్టిన వర్మి కంపోస్ట్ తయారీ, ఇతర ఉత్పత్తుల్ని పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ కార్యక్రమం అయినా రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవన్న పవన్, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కూడా కావాలని విజ్ఞప్తి చేశారు. చెత్తను వేరు చేయడం, దాన్ని పునర్వియోగం చేయడం ద్వారా చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చునని తెలిపారు.

'సజ్జల ఎస్టేట్'​కు పవన్ కల్యాణ్ - లెక్కలు తేల్చే పనిలో డిప్యూటీ సీఎం

చెత్తే కదా, దానిని ఏం చేస్తాం అనే భావన కాకుండా పునర్వినియోగానికి పనికొచ్చే చెత్తను ఇంట్లోనే వేరు చేయాలన్నారు. చెత్త నుంచి సంపదను సృష్టించాలన్నారు. చెత్త ద్వారా విద్యుత్ ప్లాంటు నిర్వహణ, వర్మీ కంపోస్టును తయారు చేసేందుకు సైతం స్థానిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని స్థానిక సంస్థలు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఇంట్లోనే చెత్తను వేరు చేయడం, నిర్మూలించే కార్యక్రమం జరిగినపుడే చెత్త ఉత్పత్తి తగ్గుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవ్ - ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కావాలి : పవన్‌ కల్యాణ్‌ (ETV Bharat)

పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచే అంశాన్ని పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల బకాయిలను సైతం కూటమి ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో మొక్కలు నాటారు. పారిశుద్ధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

విచారణలు వేగవంతం చేయండి - అధికారులకు డిప్యూటీ సీఎం పవన్​ ఆదేశం

అనంతరం పారిశుద్ధ్య పనుల్లోనూ, కృష్ణానదీ వరదల సమయంలో విలువైన సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను పవన్ కల్యాణ్ సన్మానించారు. డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సత్కారం అందుకోవడం పట్ల పారిశుద్ధ్య కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సర్పంచ్ గా గెలిచినప్పటికీ గత ప్రభుత్వంలో గ్రామానికి సంబంధించిన ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోయానని, కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిధులు కేటాయించి, గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారని సర్పంచ్ జ్యోతి హర్షం వ్యక్తం చేశారు.

5 లక్షలు పెట్టి పుస్తకాలు కొన్న పవన్‌ కల్యాణ్‌ - ఏమేం కొన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details