Deputy CM Pawan Kalyan on Rural Roads: రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలకు కార్యరూపం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరుదామని చెప్పారు.
విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏ.ఐ.ఐ.బి.) అధికారులతో ఉపముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. 250 మందికి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణం సాధ్యపడుతుందని ఆయన చెప్పారు. నెలకు రూ.200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో పురోగతి ఉంటుందని తెలిపారు.
పట్టాలెక్కుతున్న పురోగతి- ఎన్డీయే ప్రభుత్వంతో రహదారులకు మోక్షం - Widening of National Highway 44