Pawan Kalyan Meeting with World Bank Representatives:ఇంటింటికీ కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేసే అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై గ్రామీణ నీటి సరఫరాశాఖ మంత్రి హోదాలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు ఏ మేరకు నిధులివ్వగలదనే అంశంపై సమీక్షించారు. గ్రామాలకు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని బ్యాంకు ప్రతినిధులకు పవన్ వెల్లడించారు. గత ప్రభుత్వంలా నిధులను పక్కదారి పట్టించబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ జలవనరుల విభాగం సలహాదారు తదితరులు హాజరయ్యారు.
శాలువాలు బొకేలు వద్దు - కూరగాయలు ఇవ్వండి: పవన్‌కల్యాణ్ - Pawan Kalyan About Gifts
సముద్ర కోత నివారణపై దృష్టి:ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్ర కోత నివారణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. తీర ప్రాంతాల్లో అలల ఉద్ధృతికి భూమి కోతను నివారించేలా నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రిసెర్చ్, ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ అథారిటీ మధ్య ఒప్పందం కుదిరింది. తీర ప్రాంత నిర్వహణపై డిప్యూటీ సీఎం ఎన్‌సీసీఆర్ రూపొందించిన ప్రణాళిక విడుదల చేశారు. సముద్రపు కోత ప్రమాదాన్ని నివారించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇటీవల ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, రక్షణ చర్యలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. కొత్త ఓడ రేవులు, ఫిషింగ్ హార్బర్ల కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకునేలా ప్రణాళిక రూపొందించారు.