ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై దృష్టి పెట్టాలి - ఎమ్మెల్యేలకు పవన్​ కల్యాణ్​ దిశానిర్దేశం - Pawan Kalyan Meet in JSP MLAs - PAWAN KALYAN MEET IN JSP MLAS

Deputy CM Pawan Kalyan Awareness Program For MLAs: డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రజనసేన పక్షాన చేసిన జనవాణి కార్యక్రమం ఎంతో విజయవంతమైందని నియోజకవర్గ స్థాయిలో ప్రతినెలా జనవాణి చేపట్టాలన్నారు. తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. బడ్జెట్ సమావేశాలు త్వరలో మొదలు కాబోతున్నాయని నూతనంగా ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

Deputy CM Pawan Kalyan Awareness Program For MLAs
Deputy CM Pawan Kalyan Awareness Program For MLAs (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 7:42 AM IST

Deputy CM Pawan Kalyan Awareness Program for Janasena MLAs:ప్రజల ఆశలు, ఆకాంక్షలను శాసనసభలో ప్రతిఫలింప చేయాలని డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ వ్యవహారాలు, నియమావళి, సాంప్రదాయాలపై జనసేన ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమంగా సాగాలని పవన్‌ సూచించారు.

జనసేన నుంచి గెలిచిన వారిలో ఎక్కువ శాతం శాసనసభ వ్యవహారాలకు కొత్తవారేనని, అందరూ సభా నియమావళి, సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ సూచించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలకు సభా వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలన్నారు.

వారాహి దీక్షలో పవన్ కల్యాణ్ ​- నేటి నుంచి 11రోజుల పాటు ఉపవాసం - Pawan Kalyan Varahi Deeksha

గ్రామ స్థాయిలో మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరం ఉందన్న పవన్ శాంతి భద్రతల పరిరక్షణకు ఎక్కడా రాజీపడ వద్దన్నారు. భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు చర్చల్లో పరుష పదజాలం వాడవద్దన్నారు. ప్రజలతో గౌరవంగా ఉంటూ వారు తమ బాధలు, సమస్యలు చెబితే జాగ్రత్తగా వినాలని సూచించారు. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో నిస్వార్థంగా పని చేసిన జన సైనికులు, వీర మహిళలను, సభలు, కార్యక్రమాల్లో వాలంటీర్లుగా పనిచేసిన వారిని గుర్తించి, వారి కోసం ప్రత్యేకంగా కృతజ్ఞత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జనసేన పక్షాన చేసిన జనవాణి కార్యక్రమం ఎంతో విజయవంతమైందని నియోజకవర్గ స్థాయిలో ప్రతినెలా జనవాణి చేపట్టాలన్నారు.

'ఇక్కడి అబ్బాయి'ని కలిసేందుకు వచ్చిన 'అక్కడి అమ్మాయి'!- పవన్, సుప్రియ భేటీపై సరదా కామెంట్లు - Supriya met Pawan Kalyan

బడ్జెట్ సమావేశాలు త్వరలో మొదలు కాబోతున్నాయని నూతనంగా ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సభలో ప్రస్తావించే అంశాలు, చర్చల్లో పాల్గొనేందుకు తగిన అధ్యయనం చేయాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. నియోజకవర్గ అంశాలను ప్రస్తావించడంతోపాటు వాటిని రాష్ట్రస్థాయి కోణంలోనూ సభలో చర్చించడం ముఖ్యమన్నారు.

దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు తిరిగి చూసేలా అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఉద్యోగులు సహకరించాలని మంత్రి పవన్‌ కల్యాణ్‌ కోరారు. ఎంతో ఇష్టంతో కీలకమైన ఈ శాఖను తీసుకున్నానని, ఇందులో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అహర్నిశలూ కృషి చేస్తానని, ఉద్యోగులూ తగిన సూచనలు అందించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన పంచాయతీరాజ్‌ శాఖలోని ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర ప్రతినిధుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు.

ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఎలా? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​తో భేటీ అయిన సినీ నిర్మాతలు - Producers Meeting with Pawan Kalyan

ABOUT THE AUTHOR

...view details