ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ హలీమ్ - విదేశాలకు సైతం ఎగుమతి - ramadan special dishes - RAMADAN SPECIAL DISHES

Demand for Hyderabad Haleem : రంజాన్‌ అనగానే మనందరి మదిలో మెదిలే పేరు హలీమ్‌. ఈ వంటకం గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా హైదరాబాద్‌ హలీమ్​కు దేశవ్యాప్తంగా పేరు ఉంది. దీనిని అరబిక్‌ వంటకం అని కూడా అంటారు. సాధారణంగా ఇది రంజాన్‌ మాసంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏటా దాదాపు వెయ్యి కోట్లకుపైగా హలీమ్‌ వ్యాపారం జరుగుతుందంటే, ఈ మొఘలాయ్‌ వంటకానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Demand_for_Hyderabad_Haleem
Demand_for_Hyderabad_Haleem

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 12:50 PM IST

Demand for Hyderabad Haleem:హలీమ్ ఈ పేరు వినగానే అందరి నోళ్లలో నీళ్లూరుతాయంటే అతిశయోక్తి కాదు. ఈ వంటకం ప్రత్యేకతే వేరు మరి. కట్టెల పొయ్యి మీద స్వచ్ఛమైన నెయ్యితో చికెన్, మటన్​ను బాగా ఉడకబెట్టి చేసే వంటకం ఇది. రంజాన్‌ మాసంలో ఉపవాసాలు ఉండే ముస్లింలు సాయంత్రం వేళల్లో ప్రార్థనల అనంతరం దీనిని ఆరగిస్తుంటారు. ఒకప్పుడు ముస్లింలు తినే ఈ వంటకం నేడు అందరికీ ప్రీతిపాత్రమైంది. దీనిలో రుచి మాత్రమే కాదు, ప్రోటీన్ కూడా అంతే ఉంటుంది. అందుకే ముస్లింలు రోజంతా ఉపవాసం ఉండటానికి కావాలసిన ప్రోటీన్ దొరుకుతుందని దీనిని ఆరగిస్తుంటారు.

నోరూరించే హైదరాబాదీ హలీమ్ - ఇంటి వద్దే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

Hyderabadi Haleem:అందుకే హైదరాబాదీ హలీమ్​కు (Hyderabadi Haleem) జీఐ గుర్తింపు వచ్చి, ప్రత్యేక బ్రాండ్‌గా కొనసాగుతోంది. హైదరాబాద్​లో హలీమ్ తయారీలో పేరుగాంచిన పిస్తా హౌజ్‌ రోజుకు 10,000ల కిలోల హలీమ్​ను విక్రయిస్తోందని ఆ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో మాంసం అధికంగా లభిస్తుంది. దీని వల్ల హలీమ్‌కు కావాల్సిన ముడి సామాగ్రి అంతా ఇక్కడే లభిస్తుండటంతో ఎక్కువ శాతం ఇక్కడి నుంచే వేరే దేశాలకు హలీమ్​ను ఎగుమతి చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పిస్తా హౌస్‌, రాయదుర్గంలోని ఓల్డ్‌ సిటీ రెస్టారెంట్‌, ప్యారడైజ్‌ రెస్టారెంట్లు ఈ నెలలో వేరే దేశాలకు దీనిని ఎగుమతి చేస్తుంటాయి.

రంజాన్‌ స్పెషల్ ఫుడ్ - చికెన్ హరీస్, షీర్ ఖుర్మా, ఖుర్బానీ మిఠాయితో భలే పసందు - Ramadan Special Dishes

Ramadan Festival 2024 : అయితే కొన్నిసార్లు రవాణా ఆలస్యం కావడంతో దాని రుచి మారడం, పాడవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలా కాకుండా నేరుగా వంట వాళ్లనే అక్కడికి పంపి అక్కడే ఔట్​లెట్​ ఏర్పాటు చేసి, వాటిని తాజాగా వండి విక్రయిస్తున్నారు. దేశాల్లో హలీమ్ తయారు చేసే షెఫ్​లకు నెలకు రూ.2 లక్షలకు పైగా వేతనం చెల్లిస్తారు. కేవలం షెఫ్​లను పంపితే వారికి వచ్చే ఆదాయంలో పది శాతం కమిషన్​గా ఇస్తారని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. అందరికీ ప్రియమైన వంటకమైన హలీమ్ భారతీయులకే కాదు విదేశీయుల మనసులనూ దోచేసుకుంది. దీన్ని రుచి చూడటం కోసం విదేశీయులు సైతం సంవత్సరం మొత్తం వేచిచూడటం విశేషం.

'నాణ్యత​ విషయంలో మేము చాలా ఫోకస్​ చేస్తాం. చుట్టూ మొత్తం క్లీన్​గా​ ఉంచుతాం. హలీమ్​లో మూడు పదార్థాలు ఉంటాయి. 100 శాతం మటన్, చికెన్​, నెయ్యి ఉంటుంది. హలీమ్​ను ఇక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తాం.'- మహమ్మద్ అఖీల్, పిస్తా హౌజ్ ఫుడ్ ప్రొడక్షన్ మేనేజర్

రంజాన్ స్పెషల్ "రైస్ ఖీర్ పుడ్డింగ్" - ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా! - Rice Kheer Pudding Recipe

ABOUT THE AUTHOR

...view details