Police Dead Body Parcel Case Updates West Godavari District :పశ్చిమ గోదావరి జిల్లా యండగండి గ్రామంలోని ఇంటికి చెక్కపెట్టెలో శవాన్ని పంపిన కేసులో క్రమంగా చిక్కుముడులు వీడుతున్నాయి. ఆ మృతదేహం కాళ్ల గ్రామానికి చెందిన బర్రె పర్లయ్యదేనని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. నిందితుడిగా భావిస్తున్న తులసి సోదరి భర్త తిరుమాని శ్రీధర్‌వర్మ పోలీసులకు చిక్కగా, అతన్ని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. పర్లయ్య సొంత గ్రామమైన కాళ్ల గ్రామం గాంధీనగరంలోనే నిందితుడు శ్రీధర్‌వర్మ కూడా ఉంటున్నట్లు పోలీసులు నిర్దారించారు.
గ్రామంలో ఎటువంటి వివాదాలకు వెళ్లడని, కలుపుగోలుగా ఉండే తమలో ఒకరైన పర్లయ్యను హత్య చేయడం గ్రామస్థులను కలచివేస్తుంది. అమాయకుడిని అన్యాయంగా చంపేశాడని పలువుకు స్థానికులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న శ్రీధర్‌వర్మతో మాకు అసలు మాటామంతీ లేవని గ్రామస్థులు తెలుపుతున్నారు. అతడు రాత్రిళ్లే ఊళ్లోకి బుల్లెట్‌పై హెల్మెట్ పెట్టుకొని వచ్చి వెళ్తుంటాడని గ్రామస్థులు వెల్లడించారు.
మరో పెట్టె: ఇదిలా ఉండగా శ్రీధర్ వర్మ ఇంట్లో అనుమానాస్పద రీతిలో చేతబడి చేసే సామగ్రి, పుస్తకాలు, మరో పెట్టె దొరకడంతో వాటిని ఎవరి కోసం సిద్ధం చేసి ఉంచాడనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.