Daughter Begging For Mother Funeral in Nirmal :తెలంగాణలోనినిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్‌తరోడాలో ఆదివారం మనసులను కదలించే ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేరొల్ల గంగామణి(34)కి భైంసా మండలం కుంబి గ్రామానికి చెందిన వాసి నరేశ్‌తో 15 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కొంతకాలం బాగానే ఉన్న దంపతులకు కూతురు జన్మించింది. తరువాత మనస్పర్థలతో పదేళ్ల క్రితం దంపతులు విడిపోయారు. దీంతో ఆ మహిళ కూతురితో పుట్టిన ఊరికే వచ్చి ఒంటరిగా ఉంటోంది. అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పని చేసుకుంటా పాపని పోషిస్తోంది.
కొన్నేళ్లుగా పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తోంది. అదే పాఠశాలలో తన కూతరు దుర్గ కూడా 6వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు తనకుంటూ ఎవరూ లేని ఒంటరి జీవితమని కొన్ని రోజులుగా గంగ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో శనివారం రాత్రి కూతురితో కలిసి భోజనం చేసి నిద్ర పోయింది. అయితే ఉదయం కూతురు దుర్గ లేచి చూసేసరికి తల్లి ఉరేసుకుని శవమై వేలాడి కనిపించడంతో బాలిక కేకలు వేసి బోరున విలపించింది. ఆమె రోదనతో స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై భానుసింగ్ మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇప్పుడు నేనెవరి దగ్గరకు వెళ్లాలి అమ్మా :అమ్మా నేనేం పాపం చేశానమ్మా నన్ను ఒంటరిని చేసి వెళ్లి పోయావు. ఇప్పుడు నాకంటూ ఎవరు ఉన్నారు అమ్మా. చెప్పమ్మా అంటూ ఆ బాలిక రోదన అక్కడి వారి గుండెలని పిండేసింది. ఏనాటికైనా వస్తాడని అనుకున్న తండ్రి కూడా నాలుగేళ్ల కిందట మరణించారు. ఇప్పుడు తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లి, తండ్రి తరఫు బంధువులూ కూడా ఎవరూ లేరు. అనాథగా మారిన బాలిక తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలని రోదించిన తీరు అందరిచేత కంటతడి పెట్టించింది.
అనాథలకు అండగా అబ్దుల్.. 500 మృతదేహాలకు అంత్యక్రియలు!.. సమాజానికి ఏదైనా చేయాలని..