ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీకి మరో ముప్పు - ముంచుకొస్తున్న అల్పపీడనం - ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం - 24 నాటికి వాయుగుండంగా బలపడవచ్చని అంచనా

HEAVY_RAINS_DUE_TO_LOW_PRESSURE
HEAVY_RAINS_DUE_TO_LOW_PRESSURE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2024, 7:06 AM IST

Cyclone Alert Low Pressure In The Bay Of Bengal Heavy Rain Forecast :బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో ఆదివారం (అక్టోబర్​ 20న) ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో ఈ నెల 22 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తర్వాత ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి వాయుగుండంగా బలపడవచ్చని తెలిపింది. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్​, పశ్చిమబెంగాల్‌ మధ్యలో తీరం దాటొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డాక స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడన కారణంగా ఈ నెల 24వ తేదీ తర్వాత ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం (అక్టోబర్​ 18న) తిరుపతి, శ్రీసత్యసాయి, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

ABOUT THE AUTHOR

...view details