Cricketer Nitish Kumar Reddy Met CM Chandrababu: క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆస్ట్రేలియా టూర్లో సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని సీఎం అభినందించారు. సీఎంను ఆంధ్ర క్రికెట్ అసోసియషన్ అపెక్స్ బాడీతో కలిసి కలిసామని నితీష్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియాలో 100 చేసినా మ్యాచ్ కోల్పోవడం బాధ అనిపించిందని వెల్లడించారు. క్రికెట్ అనేది ఒక టీం గేమ్ అందరూ రాణిస్తేనే విజయం సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. లాస్ట్ రెండు ఇన్నింగ్స్‌లో కాస్త తడబడ్డా అంతకు ముందు ఇన్నింగ్స్‌లో లైన్ చివరలో వచ్చినా దేశం కోసం రన్స్ సాధించానన్నారు.
నితీష్‌కుమార్‌ను కలిసిన విషయాన్ని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచ వేదికపై భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన నితీష్ తెలుగు జాతికి మెరుస్తున్న స్టార్ అని అన్నారు. తన ప్రయాణంలో అతనికి మద్దతు ఇచ్చిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. నితీష్ మరెన్నో సెంచరీలు సాధించి రానున్న రోజుల్లో విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున సభ్యులు అందరం నితీష్‌తో సీఎంను కలిసామని ఎంపీ చిన్ని వెల్లడించారు. నితీష్ ప్రతిభకు తాము ప్రకటించిన 25 లక్షల చెక్ సీఎం ద్వారా అందించామన్నారు. ఐపీఎల్‌కు రాష్ట్రం నుండి గతేడాది ఐదుగురు ఎంపిక అయ్యారు. వచ్చే ఏడు 15 మంది ఎంపిక అయ్యేలా కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా తామంతా క్రీడలను ప్రోత్సహిస్తున్నామని అపెక్స్ సభ్యులు తెలిపారు.