ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూజల కోసం పిలిస్తే అసభ్య ప్రవర్తన - జ్యోతిషుడిని చంపి తగలబెట్టిన దంపతులు - ASTROLOGER MURDER AT VISAKHA

విశాఖలో ఆలస్యం వెలుగులోకి వచ్చిన హత్య ఉదంతం - మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిషుడు

couple_murdered_an_astrologer_in_-visakhapatnam_district
couple_murdered_an_astrologer_in_-visakhapatnam_district (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2025, 10:25 AM IST

Couple Murdered An Astrologer in Visakhapatnam District : తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిషుణ్ని ఓ వ్యక్తి అంతమొందించి, ఆనవాళ్లు దొరక్కుండా పెట్రోల్ పోసి తగలబెట్టేసిన ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమిలి మండలం నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు, మౌనిక దంపతులు ఆనంద పురం మండలం లొడగలవానిపాలెంలో నివాసముంటున్నారు. జ్యోతిషుడు అప్పన్న (50) గురించి తెలుసుకున్న మౌనిక ఈ నెల 7న పూజల కోసం ఆయన్ను ఇంటికి పిలిచింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అప్పన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో అతను అప్పన్నను అంతమొందించాలని ప్రణాళిక వేశాడు. ఈ నెల 9న సాయంత్రం తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని పూజలు చేయాలని చిన్నారావు అప్పన్నను కోరాడు. తనను ద్విచక్రవాహనంపై నేర్లవలస తీసుకెళ్తున్నట్లు నమ్మబలికాడు. బోయపాలెం నుంచి కాపులుప్పాడ మార్గంలోని కల్లివాని ప్రాంతంలో ఎవ్వరూ లేని ప్రాంతంలో ఆపి చాకుతో అప్పన్నను పొడిచి చంపాడు.

వీడియో కాల్​ చేసి అతడు ఉరేసుకున్నాడు - ఆపై ఆమె కూడా!

ఈ క్రమంలో తన చేతికి గాయమవడంతో 10వ తేదీన కేజీహెచ్​లో చికిత్స చేయించుకున్నాడు. తర్వాత రోజు దంపతులిద్దరూ జ్యోతిషుడి మృతదేహం వద్దకు వెళ్లి శవంపై థిన్నర్, పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ నెల 19న కల్లివానిపాలెం వద్ద అస్థిపంజరం లభించడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారావు దంపతులపై అనుమానం వచ్చి, విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి. ఇద్దర్నీ గురువారం అరెస్టు చేసి జైలుకి తరలించారు.

మెసేజ్‌లు పంపుతున్నాడని కుడిచెయ్యి నరికేశారు - వీడిన మర్డర్ మిస్టరీ!

ఇటీవల ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలోనూ ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఏసు రాజు అనే యువకుడిని బలిగొంది. ప్రియురాలి భర్త, మామలే అతడ్ని హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి గణపవరానికి చెందిన మరో వ్యక్తి సహకరించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లు తెలిసింది. పోలీసులు ముందుగా కనిపించకుండాపోయిన మృతుడి కుడి చెయ్యి భాగాన్ని కనుగొన్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం వద్దని ఆమె భర్త ఏసురాజుకు ఎన్నోసార్లు చెప్పాడు. తన భార్యతో ఏసురాజు ఉండటాన్ని చూసిన అతను తట్టుకోలేకపోయాడు. దీంతో దారుణానికి ఒడిగట్టాడు

ABOUT THE AUTHOR

...view details