Cosmo Cruise Exhibition on KBN College in Vijayawada : విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో కాస్మో క్రూయిజ్ పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఇస్రో పంపిన తొలి ఉపగ్రహం నుంచి ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్ -3 వరకు వాటి నమూనాలు ప్రదర్శించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులు ప్రదర్శనకు విచ్చేశారు. ఉపగ్రహాలు ఎలా రూపొందిస్తారు, వాటిని ఎలా ప్రయోగిస్తారనే అంశాలను విద్యార్థులు తెలుసుకున్నారు. రాకెట్ల నమూనాలను చూసేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున రావడంతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.
విజయవాడలో ప్లాస్మా ఎగ్జిబిషన్ - ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తూ ఆకట్టుకున్న విద్యార్థులు - Plasma Exhibition in Vijayawada
రాకెట్ల వినియోగం ఎలా జరిగింది, అలాగే సాంకేతికతను రాకెట్లలోకి ఎలా జోడించారు అనే అంశాలను ఇస్రో అధికారులు విద్యార్ధులకు వివరించారు. ఉపగ్రహ నమూనాలను ప్రత్యేక్షంగా చూడడం, వాటి గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. తాము అనుకున్న లక్ష్యాలను అందుకోవడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని విద్యార్థులు అంటున్నారు.