Construction Workers Problems in NTR District : వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితులు దారుణంగా మారాయంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇవ్వటం వలన నిర్మాణ రంగం జోరుగా సాగింది. అమరావతి నందిగామకు దగ్గరలో ఉండటం వల్ల భవన నిర్మాణ కార్మికులు దీనిపై ఆధారపడిన ఇతర రంగాల్లోని కార్మికులకు పనులు దొరికేవి. ప్రతిరోజు ఖాళీ లేకుండా పనులకు వెళ్తుండేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉచిత ఇసుక విధానాన్ని ఎత్తేశారు. దాని స్థానంలో ఇసుక విక్రయాలు ప్రారంభించారు. గుత్తేదారులు సంస్థకు ఇసుక విక్రయ బాధ్యతలు అప్పగించారు.
వైఎస్సార్సీపీ సర్కార్ ఇసుక విధానం - భవన నిర్మాణ కార్మికులకు శాపం
No Works for Construction workers :దీనివల్ల ఇసుక భారంగా మారింది. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గంలో మునేరు కృష్ణా నదిలు దగ్గరలోనే ఉన్నప్పటికీ ట్రక్కు ఇసుక కొనుగోలు చేసేందుకు మూడు వేల పైన ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఎడ్ల బండికి ఒక్కొక్క బండికి 400 తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇసుక కొనుగోలు చేసి నిర్మాణాలు చేయటం భారంగా మారింది. దీంతో చాలామంది ఇల్లు, ఇతర నిర్మాణాలను వాయిదా వేసుకున్నారు. నందిగామ జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు, కంచికచర్ల ప్రాంతాల్లో ఎడ్లబండ్లతో ఇసుక రవాణా చేస్తున్నారు. నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భవన నిర్మాణ రంగంలో దాదాపు 15 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు.
భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టిన జగన్ సర్కార్ - నాలుగున్నరేళ్లుగా నానావస్థలు