CONG LOKSABHA CANDIDATES 2024 :తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా రాజేందర్ రావు, హైదరాబాద్ అభ్యర్థిగా మహమ్మద్ సమీర్‌లను ప్రకటించింది. ఈమేరకు ఏఐసీసీ తుదిజాబితాను ప్రకటించింది. మరోవైపు త్వరలో జరగబోయే ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు, కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించింది.
మరో 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన - 10 స్థానాల్లో అభ్యర్థుల మార్పు
CONG MP CANDIDATES LIST TELANGANA : గత కొన్ని రోజులుగా పైమూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు సస్పెన్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం స్థానం నుంచి అభ్యర్థి ఎంపిక, అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఈస్థానం నుంచి హేమాహేమి నాయకులు తమ కుటుంబసభ్యులకు కేటాయించాల్సిందిగా పట్టుబట్టడంతో, టికెట్ ఖరారు ఆలస్యమయ్యింది. చివరకు అభ్యర్థి ఎంపిక, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద బెంగళూరులో పంచాయతీ ముగిసింది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట ఇద్దరితో వేర్వేరుగా, తర్వాత ఇద్దరితో కలిపి చర్చించారు. తొలుత ఉప ముఖ్యమంత్రి భట్టి, తన సతీమణికి టికెట్ ఇవ్వాలని కోరగా దానికి ఖర్గే అంగీకరించలేదు.