Telangana Decade Celebrations 2024: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సారి జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రత్యేక వాతావరణంలో జరిపేందుకు కసరత్తు జరుగుతోంది. జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర అధికార గీతంగా ఆవిష్కరించేందుకు జయ జయహే తెలంగాణకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాడనున్నారు.
Telangana Formation Day 2024: ఉద్యమం సమయంలో విస్తృత ప్రాచుర్యం పొంది స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గేయాన్ని నిడివిని సుమారు రెండు నిమిషాలకు కుదించడంతో పాటు కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సవరించిన అధికార చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న అధికార చిహ్నాన్ని, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని ఇప్పటికే కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. రాచరికపు పోకడలు లేని చిహ్నం, గ్రామీణ సాధారణ మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ విగ్రహం ఉంటుందని గతంలోని పలు సందర్భాల్లో మంత్రులు ప్రస్తావించారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని జూన్ 2న ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మద్దతు ధరకే తడిసిన ధాన్యం కొనుగోలు - కేబినెట్ భేటీలో నిర్ణయం - Telangana Cabinet Meeting Decisions