ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం - Ex gratia in Atchutapuram incident

Compensation to Atchutapuram Incident Victims Families: అచ్యుతాపురం ఫార్మా కంపెనీ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తామని విశాఖ కలెక్టర్‌ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబాలతో చర్చలు జరుపుతున్నారు.

Compensation to Atchutapuram Victims Families
Compensation to Atchutapuram Victims Families (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 1:10 PM IST

Updated : Aug 22, 2024, 1:43 PM IST

Compensation to Atchutapuram Incident Victims Families: అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ ఎసెన్షియా సంస్థ‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగుల‌ బాధిత కుటుంబాల‌కు రూ.కోటి ప‌రిహారం చెల్లించ‌నున్న‌ట్లు విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ తెలిపారు. కేజీహెచ్ మార్చురీ వ‌ద్ద బాధిత కుటుంబాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ గురువారం ఉద‌యం ప‌రామ‌ర్శించి ఓదార్చారు. వారితో మాట్లాడి దుర్ఘ‌ట‌నపై విచారం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా అక్క‌డ‌కు వ‌చ్చిన మీడియాతో క‌లెక్ట‌ర్ మాట్లాడారు. కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన వారికి న‌ష్ట ప‌రిహారం చెల్లింపు, క్ష‌త‌గాత్రుల‌కు వైద్య చికిత్స‌కు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు. ప్ర‌మాదంలో మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి, వార‌సుల‌కు రూ.కోటి ప‌రిహారం చెల్లించ‌నున్న‌ట్లు వివ‌రించారు. క్ష‌త గాత్రుల‌కు చెల్లించే ప‌రిహారం విష‌యంలో ప్ర‌భుత్వంతో చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

ఫార్మా సెజ్​లో జరిగిన ప్రమాదం అనుకోని దుర్ఘ‌ట‌న అని క‌లెక్ట‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అన‌కాప‌ల్లి, విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాల యంత్రాంగాలు స‌కాలంలో స్పందించి చాలా మంది ప్రాణాలు కాపాడ‌గ‌లిగాయ‌ని అన్నారు. ప్ర‌మాదంలో మృతి చెందిన 12 మృత‌దేహాలు కేజీహెచ్​కు వ‌చ్చాయ‌ని, గురువారం మ‌ధ్యాహ్నం నాటికి పోస్టు మార్టం పూర్తి చేసి సంబంధిత మృతదేహాల‌ను కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గిస్తామ‌ని చెప్పారు.

గాయ‌ప‌డిన వారిలో ప‌ది మంది విశాఖ‌ప‌ట్ట‌ణంలోని ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. వెంకోజిపాలెంలోని మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రిలో ఏడుగురు, కిమ్స్ ఆసుప‌త్రిలో ముగ్గురు చికిత్స పొందుతున్నార‌ని వెల్ల‌డించారు. వారంతా ప్ర‌స్తుతం బాగానే ఉన్నార‌ని తెలిపారు. మిగిలిన వారు అన‌కాప‌ల్లి జిల్లాలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని వివ‌రించారు. మొత్తం 41 మంది గాయ‌పడ్డార‌ని చెప్పారు. దుర్ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయి విచార‌ణ చేస్తామ‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఇప్ప‌టికే అన‌కాప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీల‌తో మాట్లాడామ‌ని త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.

AP CM Chandrababu Consoles Atchutapuram SEZ Victims: అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులకు సీఎం పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు, ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధితుల నుంచి తెసుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు. తాము అన్నీ చూసుకుంటామని, ఎంత ఖర్చు అయినా రక్షించుకుంటామని బాధితులతో సీఎం చంద్రబాబు చెప్పారు. అవసరమైన వారికి ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయిస్తామన్నారు.

తాము అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలన్నారు. అదే విధంగా బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసిందని, 17 మంది మరణించారని, 36 మందికి గాయాలయ్యాయయని తెలిపారు.

వీరిలో 10 మందికి తీవ్రగాయాలు, 26 మందికి స్వల్పగాయాలయ్యాయన్నారు. వీరికి పరిహారం ప్రకటించారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి, తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం ఇస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలందించాలని ఆదేశించినట్లు తెలిపారు.

Last Updated : Aug 22, 2024, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details