ETV Bharat / state

తణుకులో వైభవంగా కార్తిక దీపోత్సవం - ఓంకార నాదాలతో హోరెత్తిన మైదానం

ఈటీవీ ఛానళ్లలో ఆధ్వర్యంలో కార్తిక దీపోత్సవం - విష్ణు అష్టోత్తర శతనామావళి ప్రాధాన్యంపై వివరించిన నిట్టల ఫణి భాస్కరశర్మ

ETV Karthika Deepotsavam 2024 in Tanuku
ETV Karthika Deepotsavam 2024 in Tanuku (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2024, 10:27 PM IST

Karthika Deepotsavam Program Organized by ETV Channels : కార్తికంతో సమానమైన మాసం, గంగతో సమానమైన తీర్థం లేదని పురాణాలు చెబుతున్నాయి. విశేష పుణ్య సంపదను ప్రసాదించే ఈ మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

ETV Karthika Deepotsavam 2024 in Tanuku :ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కార్తిక దీపోత్సవం వైభవంగా జరిగింది. నూలి మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నారీమణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు నిర్వాహకులు పూజా సామగ్రి ఉచితంగా పంపిణీ చేశారు.

వేల దీపాల కాంతులతో నూలి గ్రౌండ్‌ ఆధ్యాత్మికంగా వెల్లివిరిసింది. సంప్రదాయ వస్త్రధారణలో దీపోత్సవానికి వచ్చిన మహిళలు, యువతుల ఓంకార నాదాలు, వేదమంత్రాలతో మైదానమంతా హోరెత్తింది. దీపోత్సవంలో పావన కార్తికంలో దీపజ్యోతులు, విష్ణు అష్టోత్తర శతనామావళి ప్రాధాన్యం అనే అంశంపై నిట్టల ఫణి భాస్కర శర్మ ప్రవచనం చెప్పారు. అనంతరం మహిళలతో సామూహికంగా దీపోత్సవ పూజ చేశారు. రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు భక్తి ప్రవత్తులతో దీపాలు వెలిగించి కైలాసనాథుడ్ని ప్రార్థించారు.

కార్తిక పౌర్ణమి రోజు "నక్షత్ర దీపారాధన" చేస్తే - గ్రహ, జాతక దోషాలన్నీ తొలగిపోతాయట!

కార్తిక దీపం ఆ మూడు ప్రాంతాల్లో వెలిగించాలి - అవేంటో మీకు తెలుసా?

కార్తిక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి? కలిగే ఫలితమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.