Medigadda Barrage News Latest :తెలంగాణలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఏర్పాటు చేసింది. సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ ఛైర్మన్‌గా, ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఎన్‌డీఎస్‌ఏ ప్రకటించింది. ఇందులో సభ్యులుగా యు.సి. విద్యార్థి, ఆర్.పాటిల్, శివకుమార్‌శర్మ, రాహుల్, అమితాబ్లను నియమించింది. ఈ మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాలపై అధ్యయనం చేయనున్న కమిటీ 4 నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రిపోర్టు ఇవ్వనుంది. బ్యారేజీ కుంగుబాటుకు గల కారణాలను పరిశీలించనుంది.
మంత్రి రోజాకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదు: నగరి వైఎస్సార్సీపీ నేతలు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారణాలను అధ్యయనం చేయడానికి నేషనల్ డ్యాం సేప్టీ అథారీటీ నిపుణుల కమిటీని నియమించింది. బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగి, పియర్స్ దెబ్బతిన్న తర్వాత అనిల్ జైన్ నాయకత్వంలో నేషనల్ డ్యాం సేప్టీ బృందం పర్యటించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అధ్యయనానికి ఎన్‌డీఎస్‌ఏ కమిటీని నియమించింది. ఐదుగురు సభ్యులుగా ఏర్పడిన బృందం ఈ బ్యారేజీలపై సమగ్రంగా విచారణ చేసి ఎన్డీఎస్ఏకు నివేదిక ఇవ్వాల్సి ఉంది.