Collector Tears at International Children's Rights Day programme in Kakinada :ఆయన జిల్లా పాలనాధికారి. గురువుల వృత్తిధర్మం ఎంత గొప్పదో, నిబద్ధతతో పని చేయకపోతే భావితరాలకు ఎంత నష్టమో వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కంటతడి పెట్టారు. కాకినాడ నగరంలో బుధవారం అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సభ జరిగింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ షాన్‌మోహన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు బాలలే బంగారు గనులని, వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సింది గురువులేనని తెలిపారు. కొంతమంది ఆ బాధ్యతను విస్మరిస్తున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఉపాధ్యాయులైన తన తల్లిదండ్రులు ఎంతో నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని పాటించారు కాబట్టే తాము ఈ స్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు. వారు సక్రమంగా విధులు నిర్వహించకపోయి ఉంటే ఆ పాపం తమకు తగిలేదన్నారు. ఈ సందర్భంలో ఆయన కంటతడి పెట్టారు.
ప్రచారంలో కన్నీటిపర్యంతమైన టీడీపీ అభ్యర్థి - Vemireddy Prashanthi Reddy