CM Meets with Belgium Ambassador: బెల్జియన్ వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. భారతదేశంలోని బెల్జియన్ రాయబారి దేవేందర్ హసల్ట్ నేతృత్వంలో ప్రతినిధులు సీఎం వద్దకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు వారికి సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలను స్వాగతిస్తున్నామన్నారు.
'పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం' - సీఎంతో బెల్జియం వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధుల భేటీ - CM meets with Belgium Ambassador - CM MEETS WITH BELGIUM AMBASSADOR
CM Meets with Belgium Ambassador: సీఎం చంద్రబాబుతో బెల్జియం వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధులు భేటీ అయ్యారు. భారత్‌లోని బెల్జియం రాయబారి హసల్ట్ బృందం సీఎం వద్దకు వచ్చారు. మరోవైపు చంద్రబాబును పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు కలిశారు. సచివాలయంలో పారిశ్రామిక వేత్త జీఎమ్మార్ భేటీ అయ్యారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 9:10 PM IST
రాష్ట్రంలో వ్యాపార అనుకూల ఎకో సిస్టమ్‌కు కట్టుబడి ఉన్నామన్నారు. దేశవిదేశాల పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబును పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు కలిశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో పారిశ్రామిక వేత్త జీఎమ్మార్ భేటీ అయ్యారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం విషయమై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. వీరితో పాటు భారత్‌లోని బెల్జియం రాయబారి, ఆ దేశ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు.