SIT To Investigate Tirumala Laddu Controversy? :తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి.
Tirumala Laddu Issue :తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు, నిఘావిభాగాధిపతి మహేష్ చంద్ర లడ్హాలతో సీఎం చర్చించినట్లు సమాచారం. సిట్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు నేడు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీటీడీ ప్రక్షాళన జరగాల్సిన సమయం ఆసన్నమైంది : మంత్రి నాదెండ్ల మనోహర్ - Nadendla Manohar on Tirumala Laddu
వైఎస్సార్సీపీ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసిన కల్తీ నెయ్యి వినియోగం, ఇతర అక్రమాలు, అధికార దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సిట్ అధిపతిగా పీహెచ్‌డీ రామకృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠిల్లో ఒకర్ని నియమించే అవకాశముంది. వీరితో పాటు వినీత్ బ్రిజ్‌లాల్, సీహెచ్.శ్రీకాంత్ పేర్లూ పరిశీలనలో ఉన్నాయి. ఐజీ, అంతకంటేపై స్థాయి అధికారిని సిట్ అధిపతిగా నియమిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా అధికారుల నేపథ్యం, వారి వివరాల్ని డీజీపీ, నిఘా విభాగాధిపతులు ముఖ్యమంత్రికి సమర్పించారు. సిట్‌లో సభ్యులుగా ఎవరెవర్ని తీసుకోవాలనేదానిపైనా చర్చించారు. సిట్ దర్యాప్తులో తేల్చాల్సిన అంశాలకు సంబంధించిన టెర్మ్‌ఆఫ్ రిఫరెన్సెస్‌ను సిద్ధం చేశారు.
భక్తులు ఆందోళన చెందొద్దు - పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశాం: టీటీడీ - maha shanti homam in tirumala
Center Show Cause Notices AR Dairy Show : తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు ఇచ్చింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం సేకరించింది. ఈ నేపథ్యంలోనే నాణ్యత పరీక్షలో ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి చెందిన నెయ్యి విఫలమైనట్లు పేర్కొంది. ఈ మేరకు గత శుక్రవారం నోటీసులు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏఆర్ ఫుడ్స్‌తోపాటు మరికొన్ని సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. సంస్థల సమాధానం, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామని ఆహార భద్రత ప్రమాణాల విభాగం స్పష్టం చేసింది.
తిరుమలలో నెయ్యి కల్తీపై సిట్ - నేడు శాంతి హోమం - Shanti Homam in Tirumala