CM Chandrababu on Relief Operations : వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీ వర్షాలు, ప్రస్తుత పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. వరద ముంపుపై ఎన్యుమరేషన్ రేపు సాయంత్రానికి పూర్తి చేయాలని, ఏ ఒక్కరూ మిస్ అవ్వకుండా ఎమ్యునరేషన్ జాగ్రత్తగా చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ రోజు సాయంత్రానికి నగర వీధుల్లో ఉన్న నీళ్లన్నీ క్లియర్ అయిపోవాయని, పారిశుధ్యం పనులు నిరంతరం కొనసాగాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతోందని, నేటి సాయంత్రానికి సరుకుల పంపిణీ కూడా పూర్తి చేయాలని తెలిపారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలుగుతామని చంద్రబాబు అన్నారు. తమ రాష్ట్రం తుఫాన్లు అధికంగా ఉండే ప్రాంతమని, దానికి అనుగుణంగా సమర్థవంతంగా ఎదుర్కొనేలా వ్యూహం సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ముగింపు దశకు చేరిన పునరుద్ధరణ పనులు - నేడు విజయవాడలో కేంద్ర వైద్య బృందం పర్యటన - Vijayawada Gradually Recovering
వర్ష సూచన ఉన్న జిల్లాల అధికారులను ముందుగానే అలెర్ట్ చేయడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని, ఆయా జిల్లాల అధికారులు సీఎంకు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఈస్ట్, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతామారామరాజు, కాకినాడ జిల్లాల్లో ముందస్తు చర్యలతో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని ఆయా జిల్లాల కలెక్టర్లు వివరించారు. జిల్లా కలెక్టర్లు అప్రమత్తత కొనసాగాలన్న ముఖ్యమంత్రి, ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు, వాగులు, వంకల పరిస్థితిపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు భేటీ - వరద పరిస్థితిపై వివరణ - Chandrababu met Abdul Nazeer
అర్థరాత్రి సీఎం సమీక్ష : విజయవాడ సాయంత్రంలోగా సాధారణ స్థితి నెలకొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సహాయ చర్యలపై విజయవాడలో మంత్రులు, అధికారులతో అర్ధరాత్రి వేళ సమీక్ష నిర్వహించారు. ముంపునకు గురైన 26 వార్డుల్లో సాధారణ స్థితి నెలకొందని పురపాలక శాఖ మంత్రి నారాయణ సీఎంకు తెలిపారు. 3 షిఫ్టుల్లో పురపాలకు సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని వివరించారు. 95 శాతం వరగు విద్యుత్ పునరుద్ధరణ జరిగిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. సాయంత్రానికి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని వివరించారు. ఇవాళ్టి కల్లా సమస్యలన్నీ పరిష్కరించి నగర పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా ఆ ప్రాంతలో క్షేత్రాస్థాయిలో తిరిగి పరిస్థితిని సమీక్షించాలని మంత్రులకు నిర్దేశించారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు.
సహాయక చర్యల్లో మోసం చేస్తే చొక్కా పట్టుకుని నిలదీయండి - నేను చూసుకుంటా: సీఎం చంద్రబాబు - CM Chandrababu on Floods Damage