CM Chandrababu Naidu Amaravati Visit: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రెండో క్షేత్రస్థాయి పర్యటనను రాజధాని అమరావతి ప్రాంతంలో చేపట్టనున్నారు. రేపు అమరావతి ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించిన సీఎం, ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచే ప్రారంభించనున్నారు. గత అయిదేళ్లు నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఉన్నతాధికారులకు ముచ్చమటలు పడుతున్నాయి. వైఎస్సార్సీపీ పెద్దలు చెప్పినట్లు చేసి రాజధానిని నిర్లక్ష్యం చేసిన ఫలితానికి రేపటి ముఖ్యమంత్రి పర్యటనతో తమపై ఇక చర్యలు తప్పవని టెన్షన్ పడిపోతూ, యుద్ధప్రాతిపదికన అమరావతి దస్త్రాలకు దుమ్ము దులుపుతున్నారు.
ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభం:గతంలో జగన్ మోహన్ రెడ్డి తొలి కలెక్టర్ల సమావేశానికి ప్రజావేదికను వాడుకుని మరీ, మరుసటి రోజే కూల్చివేసి ఇంతవరకూ శిథిలాలు కూడా తొలగించని చోట నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజధాని అమరావతి పర్యటనను గురువారం ప్రారంభించనున్నారు. విధ్వంసానికి ప్రతీకగా ఆ ప్రాంతం ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో దీనిపై ఓ కీలక నిర్ణయం కూడా తీసుకోనున్నారు. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్న ముఖ్యమంత్రి పర్యటన రాజధానిలో అన్ని నిర్మాణాల పరిశీలన దశగా సాగనుంది.
2015 అక్టోబర్ 22న ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అనంతరం సిడీయాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయ మూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలు పెట్టిన సైట్ లను చూడనున్నారు. ఐదేళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసి భవనాలను జగన్ పాడుబెట్టారు. 70, 80 శాతం నిర్మాణం పూర్తిచేసుకున్న భవనాలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వదిలేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. ముఖ్యమంత్రి హోదాలో రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు.
రాజధాని అమరావతిపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు - Narayana About Capital Amaravati
రాజధాని అమరావతిలో గత అయిదేళ్లు విధ్వంసం ఓసారి పరిశీలిస్తే, ఒక మహోన్నత లక్ష్యంతో కొత్త రాష్ట్రంలో నాడు కొత్త రాజధాని నిర్మాణాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు సంకల్పించారు. 8603 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతం, 217 చ.కీ పరిధిలో రాజధాని నగరం, 16.9 చ.కీ పరిధిలో కోర్ క్యాపిటల్ ఏరియా ఏర్పాటయ్యేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 58 రోజుల్లో రైతుల నుంచి భూ సమీకరణ చేసి దేశానికే ఆదర్శంగా ఈ విధానాన్ని తీర్చిదిద్దారు. ప్రజల, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 54 వేల ఎకరాలు సేకరించారు. భూ సమీకరణకు 29 వేల 881 మంది రైతులు 33 వేల ఎకరాలకు పైగా త్యాగం చేశారు. నిర్మాణాలు, రహదారులు, డ్రైనేజీ, ఇతరత్రా అన్నీ పోను ప్రభుత్వానికి 8 వేల ఎకరాలు మిగిలేలా ప్రణాళికలు చేశారు.
ఆ భూమి విలువ ద్వారా 2 లక్షల కోట్ల ఆదాయ వనరు ద్వారా స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టుగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రచించారు. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన జరిగింది. భూసమీకరణలో భూములు ఇచ్చిన వారిలో 32 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 14 శాతం, రెడ్డి సామాజికవర్గం 20 శాతం ఉండగా, కమ్మ సామాజిక వర్గం 18 శాతం, కాపులు 9 శాతం, ముస్లిం వర్గం 3 శాతం ఉన్నారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్ సాయంతో నవ నగరాల నిర్మణం కోసం వేగంగా ప్రణాళిక రూపుదిద్దుకుంది. ప్రజా ప్రతినిధుల భవనాల కోసం, 12 టవర్లు 288 ప్లాట్లు నిర్మించారు. ఐఎస్ఎస్, ఐపీఎస్ క్వార్టర్లకు 6 టవర్లు, 144 ఫ్లాట్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది.
రాజధాని అమరావతిని రెండున్నరేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ - narayana interview on Amaravati
ముఖ్య కార్యదర్శులకు 25 ఫ్లాట్లు నిర్మాణానికి రూ.246 కోట్లు ఖర్చు చేశారు. గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల కోసం టైప్ 1 హౌసింగ్, 4 టవర్లు నిర్మించి 384 ఫ్లాట్లు నిర్మాణం చేపట్టారు. టైప్ 2 హౌసింగ్ కింద 4 టవర్లలో 336 ఫ్లాట్లు వివిధ దశల్లో ఉన్నాయి. న్యాయమూర్తుల కోసం 36 ఫ్లాట్లు నిర్మాణం జరిగింది. ఇప్పటి వరకు 28 శాతం అవి పూర్తయ్యాయి. వీటికి మొత్తం అయిన ఖర్చు రూ.211 కోట్లు కాగా, మంత్రుల కోసం 35 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు.
2019లో అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్సార్సీపీ రాజధాని ప్రాంతానికి కులం రంగు పులిమి నిర్మాణాలు నిర్వీర్యం చేసింది. మూడు రాజధానుల రాగం అందుకుని ప్రాంతం మొత్తాన్ని నిర్మానుష్యంగా మార్చేసింది. 1600 రోజులకుపైగా అమరావతి రైతులు తమ హక్కుల కోసం పోరాడారు. వేలాది కేసులు వారిపై నమోదయ్యాయి. నాడు రాజధాని నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం రూ.9165 కోట్లు ఖర్చు చేసింది. 17.12.2019న వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు పెట్టింది. 22.11.2021న మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టును నమ్మించింది. అమరావతి రాజధానికి శాశ్వత పరిష్కారం చూపుతూ రాష్ట్ర అత్యున్నత న్యాయం స్థానం 03.03.2023న స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయినా కోర్టు తీర్పును సైతం విస్మరించిన జగన్ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూనే వచ్చింది.
పోలవరం పూర్తికి నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు- సీఎం చంద్రబాబు - AP CM Chandrababu on Polavaram
Minister Narayana on CM Tour: అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టంచేశారు. గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక వద్ద నుంచి పర్యటన ప్రారంభమవుతుందని తెలిపారు. ముందుగా కమిటీలు వేసి రాజధానిలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని మంత్రి నారాయణ వివరించారు. టెండర్లకు పెట్టిన కాలపరిమితి ముగిసింది కాబట్టి కొత్తగా టెండర్లు పిలవాలన్నారు. కొత్తగా అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాలన్నారు. టెండర్ల కనీసం మూడు నుంచి నాలుగు నెలలు సమయం పడుతుందన్నారు. క్యాబినెట్లో చర్చించిన తర్వాత పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలని దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధానిలో సామాగ్రి దొంగలించిన వారిపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. రాజధానిలో ఇళ్ల స్థలాల విషయం సుప్రీంకోర్టులో ఉందని, న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు.