CM Chandrababu Naidu Two Days Kuppam Tour :ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నుంచి 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. సోమవారం ద్రవిడ యూనివర్శిటీలో 'స్వర్ణ కుప్పం విజన్-2029' డాక్యుమెంట్ను చంద్రబాబు విడుదల చేయనున్నారు. అలాగే కుప్పం మండలం నడిమూరు గ్రామంలో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. సీగలపల్లెలో 'ఆర్గానిక్ కుప్పం' కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖి కానున్నారు. రాత్రికి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారని నేతలు తెలిపారు. 7వ తేదీ ఉదయం కుప్పం తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు.
మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాత్రికి కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారని నేతలు వెల్లడించారు. ఇక 8వ తేదీ ఉదయం విశాఖపట్నం వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సీఎం చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఎదురుదాడులకు దిగితే తాటతీస్తా - ప్రతి నెలా 'పేదల సేవలో' : సీఎం చంద్రబాబు