ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద నష్టంపై నేడు కేంద్రానికి నివేదిక పంపుతాం: సీఎం చంద్రబాబు - Chandrababu on Floods Damage in AP - CHANDRABABU ON FLOODS DAMAGE IN AP

CM Chandrababu Naidu on Vijayawada Floods: వరద నష్టంపై ఇవాళ సాయంత్రంలోగా కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుడమేరు గండి పూడ్చివేతలో సైన్యం సాయం తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇళ్లు శుభ్రం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలు తెప్పిస్తున్నామన్న ముఖ్యమంత్రి, ఆన్‌లైన్‌ ద్వారా నిర్ణీత ధరలకే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్‌ల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. నేటి నుంచి నిత్యావసరాలతో పాటు కుటుంబానికి మూడు ప్యాకెట్ల నూడుల్స్, యాపిల్స్, పాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబరు నెల విద్యుత్తు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

CM Chandrababu Naidu on Vijayawada Floods Damage
CM Chandrababu Naidu on Vijayawada Floods Damage (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 7:03 AM IST

CM Chandrababu Naidu on Vijayawada Floods Damage :కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో కలిసి విజయవాడ కలెక్టరేట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి వరకూ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రి చౌహాన్‌కు నష్టంపై ప్రాధమిక వివరాలు అందించినట్లు తెలిపారు. కేంద్రం నుంచి మిలటరీ ఇంజినీరింగ్‌ బృందం ఆధ్వర్యంలో నేటి నుంచి బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు జరుగుతాయని వివరించారు. ముంపు ప్రభావిత ప్రాంతంలో ఇంకా టీఎంసీ నీరుందని తెలిపారు. దాన్ని బయటకు పంపడంతో పాటు అపార్ట్‌మెంట్లలో నీటిని అగ్నిమాపక యంత్రాల ద్వారా తోడిస్తామన్నారు.

రాయితీపై కూరగాయల సరఫరా :ముంపు ప్రాంతాల్లో వివిధ పనులకు ఇష్టానుసారం వసూళ్లు చేయకుండా ఒకే ధర నిర్ణయిస్తామని చంద్రబాబు తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే ప్రతి ఇంటికీ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్, పెయింటర్‌లను పంపించే విధానం అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. అవసరమైతే ప్రభుత్వమే కొంత రాయితీ ఇస్తుందన్నారు. ఆర్టీసీ బస్సులను ఉచితంగానే అందుబాటులో ఉంచామన్నారు. అందరికి మూడు రోజుల్లో నిత్యావసరాల సరఫరా పూర్తి చేస్తామని తెలిపారు. తొలిరోజైన నేడు 80వేల మందికి నిత్యావసరాల కిట్‌ ఇస్తామన్నారు. రాయితీపై కూరగాయల సరఫరా కొనసాగిస్తామని వెల్లడించారు.

రాష్ట్రానికి అండగా ఉంటాం - కేంద్ర సాయం త్వరగా అందేలా చూస్తా: శివరాజ్‌సింగ్ - Shivraj Singh Chouhan on Floods

నమ్మకం కల్పించడమే బాధ్యత :వరదల వల్ల వస్తువులు, పుస్తకాలు ఇలా వివిధ స్థాయిల్లో తీవ్ర నష్టం జరిగిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తోపుడుబండ్లు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపారులు నష్టపోయారని వాపోయారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉందనే నమ్మకం కల్పించడమే తన బాధ్యత అని స్పష్టం చేశారు. పునరుద్ధరణకు ఏం చేయాలనే విషయంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడినట్లు చెప్పారు.

శవరాజకీయాలు చేస్తున్నారు :బుడమేరుపై మూడు గండ్లను పూడ్చి ఉంటే ఈ రోజు విజయవాడకు ముంపు వచ్చేది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇది వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన వారసత్వ సమస్యని దుయ్యబట్టారు. 2019లో బుడమేరుపైన 5 పనులకు 57కోట్లు మంజూరు చేశామని, వైఎస్సార్సీపీ వచ్చాక వాటిని రద్దు చేసిందని మండిపడ్డారు. వైఎస్సారసీపీ ద్రోహులు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ శవరాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటున్నారా? - బ్యాంక్​ ఖాతాల నంబర్లు ఇవే - Donate For Flood Victims

మూడో గండిని కూడా పూడ్చాలి : శనివారం 6వేల క్యూసెక్కుల నీరు రావచ్చని అంచనా వేశామన్న చంద్రబాబు, రెండు గండ్లు పూడ్చామని తెలిపారు. నగరంలోకి నీరు రాకుండా చేసేందుకు మూడో గండిని కూడా పూడ్చాల్సి ఉందని వివరించారు. బుడమేరు గండ్లు పూడ్చేందుకు కేంద్రం నుంచి మిలటరీ ఇంజినీరింగ్‌ బృందం ఆధ్వర్యంలో నేటి నుంచి పనులు జరుగుతాయని వివరించారు.

బల్లకట్టుపై బుడమేరు ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన - CM CBN Visit Flood Affected Areas

ABOUT THE AUTHOR

...view details