ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరదాలు కట్టలేదు - చెట్లు పడగొట్టలేదు - హంగు ఆర్భాటం లేకుండా చంద్రబాబు పర్యటన - Chandrababu North Andhra Tour - CHANDRABABU NORTH ANDHRA TOUR

CM Chandrababu Naidu North Andhra Tour Without Restrictions: సీఎం పర్యటన అంటే అధికారులు నానా హంగామా చేస్తారు. గతంతో జగన్ పర్యటన అంటే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడితేనే ఆయన కాలు బయట పెట్టేవారు. సామాన్య ప్రజలకు చుక్కలు చూపించాకే పర్యటన ముగిసేది. కానీ ప్రస్తుతం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ముగిసింది. 'సేవకుడిగా వచ్చా రాజును కాదు' అని అనడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

CM Chandrababu Naidu North Andhra Tour Without Restrictions
CM Chandrababu Naidu North Andhra Tour Without Restrictions (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 10:42 AM IST

CM Chandrababu Naidu North Andhra Tour Without Restrictions :ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఎలాంటి ట్రాఫిక్‌ ఆంక్షలు, బలవంతపు జనసమీకరణ లేకుండా ప్రశాంతంగా సాగింది. దీనిపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడలేదు. ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టలేదు. పరదాలు కట్టలేదు. దుకాణాలు మూయించలేదు. నాడు సీఎం హోదాలో ఉన్న జగన్‌ మోహన్ రెడ్జి పర్యటనలను (EX CM Jagan Mohan Reddy Tour) చూసి విసిగి వేసారిన ప్రజలకు ఇది పెద్ద ఊరటగానే భావిస్తున్నారు.

బస్సుల దారి మళ్లించి,బారికేడ్లు పెట్టి, పరదాలు కట్టి- సీఎం జగన్ పర్యటనతో ప్రయాణికులకు నరకయాతన

లీడర్లపై అరవొద్దు - ముందుకు పంపండి :సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 11:30 గంటలకు అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం దార్లపూడికి చేరుకున్నారు. పోలవరం ఎడమ ప్రధానకాల్వ కెనాల్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ సందర్శించారు. ఈ సమయంలో ఇరుకు రహదారులైనా పోలీసులు ఎలాంటి ట్రాఫిక్‌ ఆంక్షలూ పెట్టలేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత కూడా వాహనాలను ఆపకుండా వదిలేశారు. చంద్రబాబు ఎండలోనే నిల్చున్నారు. గొడుగు పట్టేందుకు యత్నించినా సీఎం తిరస్కరించారు. చిన్న వేదికపై నుంచే ఆయన మాట్లాడారు. చంద్రబాబును కలవడానికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇది గమనించిన చంద్రబాబు 'లీడర్లపై అరవొద్దు - ముందుకు పంపండి' అంటూ పోలీసులను ఆదేశించారు.

సేవకుడిగా వచ్చా - రాజును కాదు :అధికారులు ఒక చోట రెడ్‌ కార్పెట్‌ పరచడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. 'నేనేమీ రాజుగా రాలేదు.. ప్రజలకు సేవకుడిగా ఇక్కడికి వచ్చాను. అందరం సమానమే. మీరు నమ్మకంతో మా కూటమికి భారీ విజయాన్ని ఇచ్చారు. ఇప్పుడు సాదర స్వాగతం పలికారు. మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది' అంటూ ఇకపై ఇలాంటివి చేస్తే చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. సాయంత్రం వేళ ఎక్కడా ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టకుండా వాహన చోదకులను స్వేచ్ఛగా వదిలేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నదులను అనుసంధానించి రాష్ట్రంలో కరవు లేకుండా చేస్తాం: సీఎం చంద్రబాబు - CM Chandrababu Visit Uttarandhra

విశాఖ మళ్లీ పుంజుకుంటుంది :ఉత్తరాంధ్ర తొలి పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అభివృద్ధి దిశగా విశాఖ మళ్లీ పుంజుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర దేశానికి గ్రోత్ మోడల్‌గా మారనుందని తెలిపారు. ప్రజలు తనపై కురిపించిన ప్రేమాభిమాలన్నింటికి అసమాన సంక్షేమం, హద్దులు లేని అభివృద్ధి అసమానమైన శ్రేయస్సుతో తిరిగి చెల్లిస్తానని ప్రమాణం చేస్తున్నానన్నారు.

ఏపీలో కొత్తగా మరో ఐదు ఎయిర్ పోర్టులు- రెండేళ్లలో భోగాపురం పూర్తి:చంద్రబాబు - Chandrababu inspected Bhogapuram

ABOUT THE AUTHOR

...view details