CM Chandrababu Naidu Comments: ప్రజా ప్రతినిధుల ప్రవర్తన వల్లే వచ్చే ఎన్నికల ఫలితాలు, మెజారిటీ ఆధారపడి ఉంటాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ని అరాచకాలు చేయకపోతే 151 సీట్లు వచ్చిన వైఎస్సార్సీపీ 11కి ఎందుకు పడిపోయిందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. మనమూ అదే తీరిన వెళ్తే రాష్ట్రం మళ్లీ రావణ కాష్టమే అవుతుందని హెచ్చరించారు. ఇసుక, మద్యం విధానాల్లో వైఎస్సార్సీపీ చేసిన తప్పు తెలుగుదేశం పార్టీ నాయకులూ చేస్తానంటే ఊరుకోనని హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
Chandrababu in TDP Meeting: ప్రభుత్వం చేసిన పనుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పార్టీ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం పట్ల రాష్ట్రం మొత్తం ఎందుకు ఆసక్తి కనబరుస్తోందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. ఏ నమ్మకంతో ప్రజలు మనకు ఓటేశారో ఆ నమ్మకాన్ని అంతా నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లు తీవ్రంగా నష్టపోయి, కష్ట నష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తల బాధను సమన్వయం చేసుకోవాలని సూచించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా, ఇంతగా అధికారుల సహా వ్యవస్థలన్నీ నాశనమైన పరిణామాలు గతంలో చూడలేదన్నారు. వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించటం, పరిమిత వనరుల కారణంగా అన్నీ సరిచేయటానికి సమయం పడుతోందని వ్యాఖ్యానించారు. ఏ శాఖలోనూ సరైన ఆడిట్ జరగలేదని, కేంద్ర నిధుల్ని సైతం ఇష్టానుసారం మళ్లించేశారని మండిపడ్డారు.
అంతర్జాతీయ స్థాయిలో మోదీయే మన బ్రాండ్ - సీఎం చంద్రబాబు
Chandrababu on Preparation for Next Elections: నాయకుడికి విశ్వసనీయత రావాలంటే ఎంతో సమయం పట్టినా, చెడకొట్టుకోవాలనుకుంటే నిమిషం చాలన్న విషయం ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని చంద్రబాబు పార్టీ ప్రజాప్రతినిదులకు స్పష్టం చేశారు. తనతో సహా ఎవరికైనా ఇదే ఫార్ములా వర్తిస్తుందన్నారు. తదుపరి ఎన్నికలకు సిద్ధమవుతున్నామనే సంకేతం ఇచ్చేందుకే నిన్న ప్రధాని ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో 5 గంటలు కూర్చున్నారని, ఇక్కడ మనమూ అదే సిద్ధాంతాన్ని అనుసరించాలని తేల్చిచెప్పారు.
గత 5 ఏళ్లు సాగిన అరాచకం కారణంగా తనతో సహా, ప్రజలు, నేతలు అంతా ఇబ్బంది పడ్డారని, గెలిచాం కాబట్టి ఇక మనపనైపోయిందనుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయని గుర్తించాలని హితవు పలికారు. యువత, విద్యావవంతలు ఇలా దాదాపు 65 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారని, మంత్రుల్లో 18 మంది కొత్తవారే ఉన్నారని గుర్తుచేశారు. ప్రతీ ఇంట్లోనూ చిన్నపాటి సమస్యలుండి సమన్వయం చేసుకున్నట్లే, కుటుంబం లాంటి పార్టీలోనూ ఉండటం సహజమని చెప్పారు.
Chandrababu on Leaders Behaviour: ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రవర్తించే విధానం వల్లే వచ్చే ఎన్నికల ఫలితాలు, మెజారిటీ ఆధారపడ ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ని అరాచకాలు చేయకపోతే 151 సీట్లు వచ్చిన వైఎస్సార్సీపీ 11కి ఎందుకు పడిపోయిందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. మనమూ అదే తీరిన వెళ్తే రాష్ట్రం మళ్లీ రావణ కాష్టమే అవుతుందని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టకూడదన్న చంద్రబాబు, అలాగని కక్షసాధింపులకు వెళ్లకూడదని ఈ వ్యత్యాసాన్ని గమనించాలని సూచించారు. సంఘటిత శక్తిగా పనిచేస్తేనే ప్రజల అంచనాలను అందుకోగలమన్నారు. ఎన్డీఏలో ఎవ్వరు తప్పు చేసినా ఆ ప్రభావం ముఖ్యమంత్రి మీదే ఉంటుందని ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు.