CM Chandrababu met Tata Group Chairman Chandrasekaran:ఆంధ్రప్రదేశ్రాష్ట్ర అభివృద్ధికి రతన్ టాటా ఎంతో కృషి చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆయన దార్శనిక నాయకత్వంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్‌తో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం - టాటా గ్రూప్‌లు పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.
పర్యాటకం, పారిశ్రామిక వృద్ధిని పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 హోటళ్లను తాజ్, వివాంటా, గేట్‌వే, సెలెక్యూషన్స్, జింజర్ హోటల్స్ ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు టాటా గ్రూప్ సంసిద్ధతగా ఉన్నట్లు సమాచారం. రూ.40 వేల కోట్ల పెట్టుబడితో టాటా పవర్ సోలార్, విండ్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుపై చర్చించారు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటు ద్వారా 10 వేల ఉద్యోగాల కల్పనకు కొత్త ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో టాటా గ్రూప్ ముఖ్యమైన వాటాదారుగా కొనసాగుతోందని తేల్చి చెప్పారు.