CM Chandrababu met BPCL Representatives:రాష్ట్రంలో దాదాపు 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం,పెట్రోకెమికల్ కారిడార్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. భేటి వివరాలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దేశానికి తూర్పు తీరంగా ఉన్న రాష్ట్రంలో గణనీయమైన పెట్రోకెమికల్ సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 5,000 ఎకరాల భూమి అవసరమవుతున్నందున 90 రోజుల్లో సాధ్యాసాధ్యాలపై వివరాణ్నత్మాక ప్రణాళికతో కూడిన సమగ్ర నివేదిక కోరినట్లు వెల్లడించారు. ఇబ్బంది లేని పద్ధతిలో సౌకర్యాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదురుచూస్తోందని ఆయన స్పష్ఠం చేశారు.
CM Chandrababu met Winfast CEO: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయవలసిందిగా విన్ ఫాస్ట్ సీఈవోను ఆహ్వానించిన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్ సీఈవో ఫామ్ సాన్ చౌతో (Winfast CEO Pham San Chou) సానుకూల చర్చలు జరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన భూమి పరిశీలించాలని పరిశ్రమల శాఖను అదేశించారు. విన్‌ఫాస్ట్ నుంచి సానుకూల సహకారం కోసం ఎదురు చూస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.