CID Arrests Gautam Tej in Madanapalle File Burning Case:అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు సబ్ కలెక్టర్ కార్యాలయ ఉద్యోగి గౌతమ్ తేజ్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరులో గౌతమ్ తేజ్‌ను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు చిత్తూరు 4వ అదనపు కోర్టులో హజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దస్త్రాల దహనం కేసు దర్యాప్తు జరుగుతోందని గౌతమ్ తేజ్‍కు సహకరించిన కేసుతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్న వ్యక్తులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.
ఈ ఏడాది జూలై 21న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన దస్త్రాలు తగలబడిపోయాయి. అగ్నిప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కేసు నమోదైంది. ఈ ఘటనను సిరీయస్‍గా భావించిన ప్రభుత్వం దర్యాప్తు బాధ్యతను సీఐడీకి అప్పగించింది. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతుండగా ఎట్టకేలకు ప్రధాని నిందితుడ్ని పట్టుకున్నారు.